బిగ్ బాస్ స్వరం ఎవరిదంటే...

Update: 2017-07-24 07:18 GMT
బిగ్ బాస్ తో తెలుగు టీవీలో తొలిసారిగా ఓ భారీ రియాలిటీ షో స్టార్ మా స్టార్ట్ చేసింది. ఎంతో ప్రెస్టీజియస్ గా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాంకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను హోస్ట్ చేయడం ద్వారా క్రేజ్ మొదలైంది. పార్టిసిపెంట్లలో ఎక్కువమంది అంత పాపులర్ అయిన వారు కాకపోవడంతో మొదటి వారం రోజులు వ్యవహారం కాస్తంత డల్ గానే సాగింది. వీకెండ్ లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తిరిగి బిగ్ బాస్ హౌస్ కు రావడంతో కాస్తంత జోష్ వచ్చింది.

బిగ్ బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్లు అందరినీ కెమెరా ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది. కానీ ఇందులో కీలకమైన ఒకరు వినిపించడం తప్ప కనిపించరు. అతడే బిగ్ బాస్. అవును... షో ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేయాలో ఆర్డర్స్ ఇచ్చేది బిగ్ బాసే కదా. మరి ఆ బిగ్ బాస్ గొంతు ఎవరిది? గంభీరమైన స్వరంతో ఆ ఆదేశాలు ఇస్తోంది ఎవరు? హిందీ బిగ్ బాస్ ప్రోగ్రాంలో వాయిస్ అతుల్ కపూర్ ది. అతడు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మరి తెలుగులో వాయిస్ ఎవరిదా అన్నది ఆరా తీయగా తెలిసింది ఏమిటంటే అతడు రాధాకృష్ణ అని. ఈయన ఎక్కువగా సీరియల్స్ కు డబ్బింగ్ చెబుతుంటాడు. సినిమాల్లో చాలామంది విలన్ పాత్రధారులకు డబ్బింగ్ చెప్పారు. ఈయనతోపాటు మాటీవీలో హిందీ డబ్బింగ్ సీరియల్ కు పనిచేసిన శంకర్ కూడా వాయిస్ ఇస్తున్నారనేది టాక్.

సాధారణంగా అందరూ తెరపై పాత్రలనే చూస్తారు. అందుకు గొంతు ఎవరు అరువిచ్చారన్నది చూడరు. ఎప్పుడో అరుంధతి లాంటి సినిమాలు డబ్బింగ్ ఆర్టిస్టులకు పేరు తెస్తాయి. బిగ్ బాస్ పుణ్యమా అని మరోసారి డబ్బింగ్ ఆర్టిస్టుల టాలెంట్ డిస్కషన్ కు వచ్చింది.



Tags:    

Similar News