హాట్ టాపిక్: వీవీ వినాయక్ హెయిర్ స్టైల్

Update: 2019-09-03 04:18 GMT
మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన వీవీ వినాయక్ ఈమధ్య స్లో అయిన విషయం తెలిసిందే.  'ఇంటిలిజెంట్' సినిమా పరాజయంతో వినాయక్ ఈ జెనరేషన్ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలకు దర్శకత్వం వహించలేక పోతున్నారనే అభిప్రాయం బలపడింది. దీంతో వినాయక్ కూడా డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా తన లక్కు టెస్ట్ చేసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు వచ్చాయి.  దీనికి తగ్గట్టే వినాయక్ జిమ్ములో కసరత్తులు చేస్తూ పర్ఫెక్ట్ ఫిజిక్ పై దృష్టి పెట్టడంతో అది నిజమేనని తేలిపోయింది.

రీసెంట్ గా వినాయక్ 'రాగల 24 గంటల్లో' సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.  ఆ సినిమా ఈవెంట్ లో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం వినాయక్ లుక్. అంటే స్లిమ్ గా ఉండే వినాయక్ అనుకునేరు.. కాదు కాదు. వినాయక్ ఇంకా కొన్ని రోజులు వర్క్ అవుట్ చేస్తేనే స్లిమ్ లుక్ లో కనిపించే అవకాశం ఉంది. ఇంతకీ అందరినీ ఆకర్షించిన అంశం ఏంటంటే వినాయక్ హెయిర్ స్టైల్.  గతంలో పైకి దువ్వే అలవాటు ఉన్న వినాయక్ పక్కకు దువ్వారు.  మరో విషయం ఏంటంటే ఆ జుత్తు చాలా ఒత్తుగా ఉంది.  సరిగ్గా నెల క్రితం వినాయక్ ఒక  ప్రెస్ మీట్ లో మాట్లాడిన సమయంలో వినాయక్ జుట్టు కాస్త పలుచగానే ఉంది. మరి ఒక్క నెలలో ఇంత ఒత్తుగా మారిందంటే.. అందుకోసం ఏదో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టే కదా!

ఒకవేళ అలా హెయిర్ ఒత్తుగా కనిపించడం కోసం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా అదేమీ పెద్దం నేరం ఘోరం కాదు లెండి.  ఎందుకంటే మన స్టార్ హీరోలలో కొందరు హెయిర్ వీవింగ్ తో తమ బట్టతలను కవర్ చేసుకుంటున్నారని ఎన్నో రూమర్లు ఉన్నాయి.  ఇప్పుడు మీరు ఆ స్టార్ హీరోలు ఎవరు పేరు చెప్పండి అని అడక్కండి. ఆశ దోశ అప్పడం.. వినాయకుడి కుడుము!

Tags:    

Similar News