స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ హీరోగా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల అక్టోబర్ 9న ఘనంగా ప్రారంభం కానున్న ఈ సినిమాలో వినాయక లుక్ పెద్ద సమస్యగా మారింది. హీరోగా సినిమా అని ఎప్పుడైతే అనౌన్స్ మెంట్ వచ్చిందో అప్పటి నుండి రకరకాల విగ్గులు మారుస్తూ ఈవెంట్స్ కి ఎటెండ్ అవుతూ నానా ఇబ్బందులు పడుతున్నాడు వినాయక్.
మొన్నీ మధ్య ఓ ఈవెంట్ కి ఎటెండ్ అయిన వినాయక లుక్ అందరికీ నవ్వు తెప్పించింది. ఈ స్టార్ డైరెక్టర్ కి ఇదంతా అవసరమా అంటూ నెటిజర్లు ట్రోల్స్ కూడా చేసారు. అయితే ఇక నిన్న 'సైరా' ఈవెంట్ లో కూడా అవే కామెంట్స్ అందుకున్నాడు వినాయక్. గడ్డం పెంచి నెత్తి మీద ఓ రకమైన విగ్గు పెట్టి స్పెక్ట్స్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపించే ప్రయత్నం చేసాడు. నిజానికి ఆ లుక్ లో వినాయక్ ని చూసి అందరూ షాకయ్యారు. అయితే ఇప్పటికే రెండు మూడు విగ్గులు మార్చిన వినాయక్ కి ఎందుకో ఏదీ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వట్లేదు. త్వరలోనే హెయిర్ స్టైల్ కోసం ముంబై కూడా వెల్లనున్నాడని తెలుస్తుంది.
నిజానికి వినాయక్ హీరోగా సినిమా చేస్తున్నప్పటికీ అందులో స్తలిష్ గా హీరోలా కనిపించనక్కర్లేదు. అతను చేసేది ఓ మధ్య తరగతి రైతు సినిమా. రెండు షేడ్స్ ఉన్నప్పటికీ అందులో కూడా మరీ అంత వేరియేషన్ ఉండదని అంటున్నారు. మరి ఈ దర్శకుడు సినిమా ఇంకా సెట్స్ పైకి రాకుండానే హీరో లుక్ కోసం ఆ ఇమేజ్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నాడో..ఈవెంట్స్ కి విగ్గులతో ఎందుకు వస్తున్నాడో ఆయనకే తెలియాలి.