అల్లుడు శీను.. అఖిల్.. వరుస పరాజయాలు ఎదుర్కున్న దర్శకుడు వివి వినాయక్.. రీసెంట్ గా చిరంజీవి కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ హిట్ సాధించేశాడు. ఈ మూవీ సక్సెస్ లో మెజారిటీ క్రెడిట్.. చిరంజీవికే దక్కినా.. ఆ ప్రాజెక్టును వినాయక్ హ్యాండిల్ చేసిన తీరును మాత్రం ప్రశంసించాల్సిందే. సరైన సబ్జెక్ట్ ఉంటే.. తాను ఎంత పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలడో చూపించాడు వినాయక్.
అయితే.. ఈ దర్శకుడి తర్వాతి సినిమాపై మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ వరుస కమిట్మెంట్స్ తో ఇప్పుడప్పుడే ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోయింది. తాజాగా మరో మెగా హీరో సాయిధరం తేజ్ తో వినాయక్ ఓ మూవీ చేస్తాడనే టాక్ వచ్చింది కానీ.. దీనిపై ఎలాంటి అప్ డేట్ కానీ అనౌన్స్ మెంట్ కానీ రాలేదు. కానీ ఇప్పుడు వివి వినాయక్ మెగా క్యాంప్ నుంచి నందమూరి ఫ్యామిలీకి షిఫ్ట్ అయ్యాడనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణను కలిసిన వినాయక్.. ఓ ప్రాజెక్టుపై దాదాపు ఒప్పించాడని అంటున్నారు. ప్రస్తుతం సీనియర్ రైటర్స్ కొందరు.. స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారట.
ఇది గనుక మెప్పిస్తే.. బాలయ్యతో సినిమా ఫైనల్ అయినట్లే అంటున్నారు. మరోవైపు.. బాలకృష్ణతో గతంలో ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకున్న నిర్మాత బెల్లంకొండ సురేష్.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారనే టాక్ మరీ సెన్సేషన్ గా మారింది. 2002లో బాలకృష్ణ-వివి వినాయక్ కాంబినేషన్ లో చెన్నకేశవ రెడ్డి చిత్రం వచ్చిందంతే. మళ్లీ 15 ఏళ్లకి ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/