ఏడాదిన్నర క్రితం అక్కినేని అఖిల్ అరంగేట్ర చిత్రం అఖిల్ డిజాస్టర్ తర్వాత కూడా.. దర్శకుడు వివి వినాయక్ పై నమ్మకం ఉంచారు మెగాస్టార్ చిరంజీవి. తన కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150ని వినాయక్ చేతిలోనే పెట్టాడు. చిరు నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయలేదు వినాయక్. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా ఖైదీని నిలపడంలో సక్సెస్ అయ్యాడు.
ఖైదీ నంబర్ 150 తర్వాత కొత్త సినిమాను ఈ దర్శకుడు అనౌన్స్ చేయలేదు. అయితే.. కొన్ని రోజులుగా రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి. వినాయక్ ఓ కుర్ర హీరోతో సినిమా చేయనున్నాడని అన్నారు. అలాగే మంచు మనోజ్ తో వినాయక్ ఓ సినిమా చేయనున్నాడనే టాక్ కూడా వచ్చింది. అయితే.. ఇవన్నీ రూమర్స్ మాత్రమే అంటున్నారు వినాయక్ సన్నిహితులు. మనోజ్ తో కానీ.. మరే కుర్ర హీరోతో కానీ మూవీ చేయాలని అనుకోవడం లేదట వినాయక్. అసలు అలాంటి చర్చలేవీ జరగడం లేదని తేల్చేస్తున్నారు.
మరోవైపు కొత్త సబ్జెక్ట్ ని దాదాపుగా రెడీ చేసేసుకున్న వినాయక్.. పలువురు స్టార్ హీరోలతోనే సంప్రదింపులు జరుపుతున్నాడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను స్వయంగా చేస్తాడట ఈ పక్కా మాస్ డైరెక్టర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/