మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150తో ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు దర్శకుడు వివి వినాయక్. దాదాపు దశాబ్దం తర్వాత తిరిగి సినిమాలో కనిపించనున్న మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎలా చూడాలని అనుకుంటారో.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించడంలో సక్సెస్ అయ్యాడు వినాయక్.
అయితే.. ఆ మూవీ వచ్చిన ఆరు నెలలకు తన మరుసటి చిత్రాన్ని ప్రారంభించాడు వినాయక్. మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందించనుండగా.. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీకి దుర్గ అనే టైటిల్ ను ఖాయం చేశారనే న్యూస్ ఉంది. కానీ ఈ వార్తలను ఖండించాడు దర్శకుడు. 'ఇంకా మేం ఏ టైటిల్ ను ఫిక్స్ చేసుకోలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పైనే కాన్సంట్రేట్ చేశాం. ఆ తర్వాతే టైటిల్ నిర్ణయిస్తాం. ఆకుల శివ అందించిన కథకు.. పరుచూరి బ్రదర్స్.. సత్యానంద్ లు తమ రచనా సహకారం అందించనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమా.. నా కమర్షియల్ చిత్రాల మాదిరిగా.. అన్ని హంగులతో నిండి ఉంటుంది' అని చెప్పాడు వినాయక్.
మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్.. అల్లు అర్జున్ లతో కూడా సినిమాలు తీసిన వినాయక్.. ఇప్పుడు మరో మెగా హీరో తేజుతో కూడా సినిమా చేస్తుండడం విశేషం. ఈ చిత్రానికి అన్నిటికంటే ప్రత్యేక ఆకర్షణ.. స్క్రిప్ట్ అంటున్నాడు మాస్ డైరెక్టర్ వివి వినాయక్.