నో పాలిటిక్స్ అంటున్న ఫ్యాక్షన్ డైరెక్టర్

Update: 2018-02-08 06:01 GMT
తెలుగు తెరపై ఫ్యాక్షన్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపించేలా చేసిన దర్శకుల్లో మొదటి స్థానం బి.గోపాల్ దైతే నవతరం దర్శకుల్లో మాత్రం ఆ చైర్ వివి వినాయక్ దే. ఇప్పుడు ఆ సీజన్ లేదు కాబట్టి తీయటం తగ్గించాడు కాని ఈ పాటికి సుమోలు గాలిలో లేచే సినిమాలు మరికొన్ని వచ్చేవి. గత ఏడాది ఖైది నెంబర్ 150తో వంద కోట్ల సినిమాకు దర్శకత్వం వహించినా తనను తాను ఇంకా బెటర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వినాయక్ కు పడింది. కారణం  ఖైది మూవీ చిరు ఇమేజ్ వల్ల ఆడింది అనే కామెంట్ రావడం, రీమేక్ కాబట్టి ఎక్కువ రిస్క్ చేయకుండా ఒరిజినల్ స్టైల్ లోనే తీయటం వల్ల వినాయక్ లోని అసలు దర్శకుడికి పని దొరకలేదు. ఇప్పుడు ఇంటెలిజెంట్ ద్వారా స్ట్రెయిట్ స్టొరీ తో తన సత్తా రేపు చూపించే ప్రయత్నంలో ఉన్నాడు. వరస ఫ్లాప్ లతో ఉన్న సాయి ధరం తేజ్ తో హిట్ కొట్టిస్తే తన ఫాం పూర్తిగా వచ్చేసింది అనే మెసేజ్ ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోతుంది.

ఈ నేపధ్యంలో ఇంటెలిజెంట్ సినిమా ప్రమోషన్ కోసం వినాయక్ ఇస్తున్న ఇంటర్వ్యూలలో అతని రాజకీయ ప్రవేశం గురించి కూడా పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. గతంలో చిరు ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడే వినాయక్ పోలిటిక్స్ రావాలనే ఉద్దేశంతోనే చాగల్లులో చాలా సేవా కార్యక్రమాలు చేసాడని ఒక టాక్ ఉండేది. వచ్చే సంవత్సరం ఎన్నికల్లో వైఎస్ ఆర్ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తూ అందులో భాగంగానే రాజమండ్రిలో ఇంటెలిజెంట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసారని వార్తలు రేగాయి. కాని వినాయక్ అవన్నీ కొట్టిపారేస్తున్నాడు. విధిని తాను శాసించడం లేదన్న వినాయక్ రాత ఎలా ఉంటే అలా ముందుకు సాగుతాను తప్ప అదే పనిగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదట.

నిజానికి వినాయక్ అవుట్ అఫ్ ది ఫాంలో ఏమి లేడు. అఖిల్ డిజాస్టర్ అవ్వడం తప్పిస్తే గత కొన్నేళ్ళలో వినాయక్ మరీ దారుణ పరాజయాలు ఏమి అందుకోలేదు. కాకపోతే ఒకే ఫార్ములాలో సినిమాలు తీస్తాడు అనే కామెంట్ అయితే ఉంది. సరైన కథ దొరకాలే కాని మాస్ హీరోయిజంని తెర మీద ఎలివేట్ చేసి చూపడంలో మంచి ఎక్స్ పర్ట్. మరి వినాయక్ కొట్టిపారేసినట్టు అతనికి నిజంగానే రాజకీయ ఉద్దేశం లేదేమో. తరువాత చేయబోయే సినిమా గురించి వినాయక్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.



Tags:    

Similar News