వినాయక్ ఏం మారలేదన్నమాట..

Update: 2015-09-03 20:01 GMT
బెల్లంకొండ శ్రీనివాస్ బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే.. అతడి తొలి సినిమా ‘అల్లుడు శీను’ రూ.20 కోట్ల దాకా వసూలు చేయడం చాలా పెద్ద విషయమే. ఐతే మీడియం బడ్జెట్లో తీసి ఉంటే దీన్ని సూపర్ హిట్టుగా చెప్పుకునేవాళ్లం. కానీ పెట్టుబడిలో సగమే వసూలు చేసింది కాబట్టి దాన్ని పెద్ద డిజాస్టర్ గా చెప్పుకోవాలి. శ్రీనివాస్ ను అంత బాగా లాంచ్ చేసినందుకు వినాయక్ అభినందనీయుడే. కానీ మార్కెట్ లెక్కలు చూసుకోకుండా విపరీతంగా ఖర్చు పెట్టించినందుకు మాత్రం అతణ్ని విమర్శించాల్సిందే. ఒక్కో పాటకు రెండు మూడు చొప్పున భారీ సెట్లు.. ఫారిన్ లొకేషన్లు.. అబ్బో ‘అల్లుడు శీను’లో హంగామాకు కొదవే లేదు. కానీ ఆ సెట్లు, ఆ లొకేషన్ల వల్ల సినిమాకేమైనా గొప్ప లాభం చేకూరిందా అంటే అదేమీ లేదు. వాటి వల్ల అదనంగా ఎంత లాభం వచ్చి ఉంటుందో అంచనా వేయగలం.

ఐతే వినాయక్ తన తర్వాతి సినిమా విషయంలో ఏమీ రాజీ పడట్లేదు. ‘అఖిల్’ సినిమాలో కూడా ఈ అదనపు ఆకర్షణలకు కొదవ లేదట. సెట్ల విషయంలో భారీ హంగామా ఉంటుందట. ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ ఈ సినిమా కోసం ఏకంగా ఎనిమిది సెట్లు వేసినట్లు సమాచారం. అవన్నీ కూడా చాలా భారీగానే ఉంటాయట. పాటలతో పాటు ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ అంతా సెట్లలోనే సాగిందట. ఈ సెట్లకు కోట్లల్లోనే ఖర్చయిందని సమాచారం. ఐతే అఖిల్ కు ఉన్న క్రేజ్.. ‘అఖిల్’ సినిమా మీద ఉన్న హైప్ ప్రకారం చూస్తే ఈ ఖర్చు పెద్ద ప్రాబ్లెం అయ్యే అవకాశమేం లేదు. ఈ సినిమాకు ఇప్పటికే రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని.. నిర్మాత నితిన్ ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్స్ తో ఉన్నాడని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రమాదమేమీ లేదన్నట్లే.
Tags:    

Similar News