మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం చాలామంది దర్శకులతో సంప్రదింపులు జరిపారు. అలాగే చాలామంది స్టార్ రైటర్లు కూడా ఆయనకు కథలు వినిపించారు. చివరకు ఆయన ఒక రీమేక్ సినిమాను అనుకుని.. దానికి వివి వినాయక్ ను డైరక్టర్ గా ప్రకటించేశారు. అయితే కేవలం మెగా ఫ్యామిలీతో సాన్నిహత్యం వలనే వినాయక్ కు ఈ అవకాశం రాలేదట. దానికి వేరే రీజన్స్ ఉన్నాయ్. పదండి అవేంటో చూద్దాం.
''ఒకరోజు అన్నయ్య ఫోన్ చేసి.. 'కత్తి' సినిమా చూశావా అన్నారు. చూశాను అని చెప్పాను. నన్ను ఊహించుకుని ఒకసారి చూడు అన్నారు. వెంటనే మళ్ళీ కత్తి సినిమాను చూసి.. ఆ సినిమా చిరంజీవి గారు చేస్తే మాత్రం కాస్త కామెడీ యాంగిల్ కాస్త మాస్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది.. కాస్త కథను మార్చి ఆయనకు 2 గంటల నెరేషన్ ఇచ్చాను. అదేదో రీమేక్ లా కాకుండా కొత్త కతే అన్నట్లు నెరేట్ చేయడంతో.. వెంటనే చిరంజీవి గారు లేచి ఒక హగ్ ఇచ్చారు. అలా నేను చెప్పిన మార్పులతోనే ఇప్పుడు సినిమాను తీశాం. ఫైనల్ కాపీ చూశాక.. అదిరిపోయింది వినయ్.. తిరుగులేదు అని చిరంజీవిగారు చెప్పడంతో.. నాకు అస్సలు రిలీజ్ టెన్షనే లేదు'' అంటున్నాడు డైనమిక్ డైరక్టర్ వివి వినాయక్ తనకు ఈ 150వ సినిమా డైరక్షన్ ఛాన్స్ ఎలా వచ్చిందో వివరించాడు.
గతంలో ఇలాగే 'ఠాగూర్' సినిమాలో కూడా.. క్లయమ్యాక్స్ లో హీరో చనిపోయే వెర్షన్ తమిళంలో ఉంటే.. తెలుగులో మాత్రం కిరాక్ పుట్టించే కోర్టు సీన్ క్రియేట్ చేసి రచ్చ చేశారు మెగాస్టార్ అండ్ వినాయక్. ఇప్పుడు కూడా వీరి మార్పులూ చేర్పులూ అలాంటి మ్యాజిక్ ఏమైనా చేస్తాయేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/