అది బ్ర‌హ్మానందం కోసం రాసిన పాత్ర కాదు

Update: 2017-01-10 16:37 GMT
మెగాస్టార్ చిరంజీవి-బ్ర‌హ్మానందంల‌ది తిరుగులేని కాంబినేష‌న్. ఎన్నో సినిమాల్లో ఇద్ద‌రూ క‌లిసి వినోదం పంచారు. బ్ర‌హ్మి సినిమాల్లో రావ‌డానికి చిరునే కార‌ణం అన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో చిరుపై త‌న అభిమానాన్ని చాలాసార్లు చాటుకున్నాడు బ్ర‌హ్మి. అలాగే చిరు కూడా బ్ర‌హ్మిపై ఎప్ప‌టిక‌ప్పుడు తన అభిమానాన్ని చూపిస్తూనే వ‌చ్చాడు. ఈ మ‌ధ్య అవ‌కాశాలు లేక బ్ర‌హ్మి మ‌రుగున ప‌డిపోయిన స‌మ‌యంలోనూ త‌న రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబ‌ర్ 150’లోనూ చిరు ప‌ట్టుబ‌ట్టి బ్ర‌హ్మి కోసం ఒక పాత్ర పెట్టించాడు. ఐతే బ్ర‌హ్మి కోసం వినాయ‌క్ కొత్త‌గా పాత్ర ఏమీ రాయించ‌లేద‌ట‌. వేరొక‌రి కోసం అనుకున్న పాత్ర‌ను బ్ర‌హ్మికి మ‌ళ్లించాడ‌ట‌.

‘‘ఖైదీ నెంబ‌ర్ 150 మాతృక క‌త్తిలో కామెడీ పెద్ద‌గా ఉండ‌దు. తెలుగు వెర్ష‌న్లో కావాల్సినంత కామెడీ ఉంటుంది. బ్ర‌హ్మానందంను సినిమాలో కావాల‌ని అడిగి మ‌రీ పెట్టించుకున్నారు అన్న‌య్య‌. నిజానికి ఈ పాత్ర‌కు ముందు ర‌ఘుబాబును దృష్టిలో ఉంచుకుని రాయించాం. ఐతే చిరు బ్ర‌హ్మానంద‌మే కావాల‌న‌డంతో కొన్ని మార్పులు చేసి ఆయ‌న‌కే ఈ పాత్ర ఇచ్చాం’’ అని వినాయ‌క్ తెలిపాడు. ఇక ‘ఖైదీ నెంబ‌ర్ 150’లో పృథ్వీ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల్లో కోత వేయ‌డంపై వినాయ‌క్ స్పందిస్తూ.. ‘‘40 సెక‌న్ల నిడివి ఉన్న స‌న్నివేశాలు తొల‌గించాం. ఐతే ఈ విష‌య‌మై పృథ్వీ స్పందిస్తూ.. అమ్మ చ‌నిపోయినంత బాధ క‌లిగిన‌ట్లు చెప్ప‌డం చూసి నేనూ చాలా బాధ‌ప‌డ్డా. చిరంజీవి గారు కూడా పృథ్వీని హ‌ర్ట్ చేయ‌డం ఇష్టం లేక ఆ స‌న్నివేశాల్ని ఉంచేయ‌మ‌న్నారు’’ అని చెప్పాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News