మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాను వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అసలు ఈ దర్శకుడికి ఎంతిచ్చి ఉంటారు? అప్పట్లో తన కొడుకుతో హిట్టు సినిమా తీసినందుకు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఏకంగా జూబ్లీ హిల్స్ లో ఒక విల్లా ఇచ్చారు. మరి కొణిదెల ప్రొడక్షన్స్ వారు ఎంతిచ్చారో ఏమన్నా తెలుసా?
ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. వినాయక్ ఈ సినిమాకు డబ్బులు తీసుకోవట్లేదు. ఈస్ట్ గోదావరి రైట్స్ ను తీసుకుంటున్నాడని తెలుస్తోంది. తను పశ్చిమగోదావరి చాగల్లుకు చెందినవాడైనా.. వెస్ట్ రైట్స్ ను అల్లు అరవింద్ తీసుకుంటారనే టాక్ ఉంది కాబట్టి.. ఈస్ట్ రైట్స్ తాను తీసుకుంటున్నాడట. అనుశ్రీ ఫిలింస్ అనే లోకల్ డిస్ర్టిబ్యూటర్ ద్వారా ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేస్తారని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ రైట్స్ విలువ 5.5 కోట్లగా లెక్కకట్టారు. ఆ పైన ప్రాఫిట్ వస్తే అది లోకల్ డిస్ర్టిబ్యూటర్ అండ్ వినాయక్ షేర్ చేసుకుంటారట.
ఈ రెమ్యూనరేషన్ సంగతి అటుంచితే.. అఖిల్ సినిమాతో తొలిసారి కెరియర్లో డిజాష్టర్ ను చవిచూసిన వినాయక్ పై ఇప్పుడు హిట్టు డెలివర్ చేయాల్సిన బాధ్యత మరింత అధికంగా ఉంది.