ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఫెస్టివెల్ కు పోటీ పోటీగా పోటీపడుతున్నాయంటే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మా హీరో సినిమా గొప్ప అంటే మా హీరో సినిమా గొప్ప అంటూ విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ నానా హంగామా చేస్తుంటారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతూ వుంటుంది. ఇప్పటికే తమిళ నాట విజయ్, అజిత్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. విజయ్ పై అజిత్ అభిమానులు విమర్శలు చేస్తూ రచ్చ చేస్తుంటే.. విజయ్ అభిమానులు కూడా అదే తరహాలో కౌంటర్ లిస్తున్నారు.
తమిళ నాట నానా రచ్చ చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు నటించిన వారీసు, తునీవు సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఒకే రోజు పొంగల్ కు పోటీపడుతున్న వేళ టాలీవుడ్ లో మాత్రం ఆ వాతావరణం కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఇక ఈ మూవీ రిలీజ్ కి ఒక్క రోజు తరువాత అంటే జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` రిలీజ్ అవుతోంది. రవితేజ కీలక అతిథి పాత్రలో నటించాడు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తరువాత చిరంజీవి, బాలకృష్ణ సంక్రాంతి బరిలో పోటీకి దిగుతుండంతో ఫ్యాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో వుండటం ఖాయం అని జోరుగా చర్చ నడిచింది. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఆ రచ్చ ఎక్కడా కనిపించడం లేదు.
దీనికి బలమైన కారణం దిల్ రాజు. యస్ తన వల్లే మోగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ రచ్చ సైలెంట్ అయిపోయింది. దిల్ రాజు ఈ పండక్కి విజయ్ తో నిర్మించిన `వారీసు`ని తెలుగులో `వారసుడు`గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కీలక థియేటర్లని `వారసుడు` కోసం బ్లాక్ చేసి పెట్టుకోవడంతో ఫ్యాన్స్ దృష్టి మొత్తం మారిపోయింది. మా హీరో కు ఏ సెంటర్ లో ఎన్ని థియేటర్లు దక్కాయో తెలుసుకునే పనిలో ఫ్యాన్స్ అంతా బిజీగా మారిపోయారు. ఇంకా వార్ కు టైమ్ ఎక్కడుంటుంది.
అంతే కాకుండా దిల్ రాజు చేసిన పని వల్ల మెగా, నందమూరి ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు బురద జల్లు కోవడం మానేసి దిల్ రాజు ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మూకుమ్మడిగా విమర్శలు చేస్తూ పండగ వార్ నే పూర్తిగా మర్చిపోయారు. ఇప్పడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పండగ వేళ హీరో ఫ్యాన్స్ మధ్య వార్ కు బ్రేకిచ్చి సైలెంట్ అయిపోవండతో సంక్రాంతి సందడే కనిపించడం లేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.