పంచుల్లో వీర‌సింహమా? వీర‌య్యా? ఎవ‌రు గొప్ప‌?

Update: 2023-01-08 02:30 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `వీర సింహారెడ్డి` ట్రైల‌ర్ తో బాల‌య్య మాస్ ఫ్యాన్స్ లో జోష్‌ మరో లెవ‌ల్ కి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ట్రైల‌ర్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ స‌క్సెస్ చేసిన మైత్రి మూవీ మేక‌ర్స్ ఈరోజు నువ్వా నేనా? అనేలా మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీర‌య్య` ట్రైల‌ర్ ని లాంచ్ చేయ‌డంతో ఈ ఉత్సాహం మ‌రింత పెరిగింది. ఈ సంక్రాంతికి నంద‌మూరి బాల‌కృష్ణ .. మెగాస్టార్ చిరంజీవి డ‌బుల్ బొనాంజా ట్రీట్ ని ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఈ రెండు ట్రైల‌ర్లు వీక్షించాక ఈ రెండిటిలో ఏది బెస్ట్? ఏ సినిమా డైలాగుల్లో ఎంత ప‌వ‌రుంది? అంటూ అభిమానులు లెక్క‌లు క‌డుతున్నారు. తాజాగా వీర‌య్య ట్రైల‌ర్ వీక్షించాక చాలా విష‌యాల‌పై క్లారిటీ వ‌చ్చేసింది. పంచ్ ల ప‌రంగా ఇద్ద‌రూ ఎక్క‌డా త‌గ్గ‌లేదు. మాస్ యాక్ష‌న్ ఎలివేష‌న్స్ లోను త‌గ్గేదేలే అన్న‌ట్టుగా ఉన్నారు చిరు-బాల‌య్య‌. విజువ‌లైజేష‌న్ ప‌రంగా హై ఆక్టేన్ యాక్ష‌న్ సీక్వెన్సుల ప‌రంగాను మైత్రి మూవీ మేక‌ర్స్ ఆ రేంజులో ఇరు సినిమాల‌కు భారీ బ‌డ్జెట్ల‌ను కుమ్మ‌రించింద‌ని అర్థ‌మ‌వుతోంది.

నిన్న‌టి వీర‌సింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. నటసింహం వీర సింహమై గర్జిస్తే ఎలా వుంటుందో వీరసింహారెడ్డి సినిమా అలా వుంటుందని అన్నారు. ప్రపంచంలోని బాలకృష్ణ అభిమానులంతా మీసం తిప్పి కాలర్ ఎగరేసుకునేలా వుంటుంది. వీరసింహారెడ్డి ఫుల్ ప్యాకేజీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ తో పాటు బాలయ్య బాబు అభిమానులు పండగ చేసుకునేలా వుంటుందని అన్నారు. దానికి త‌గ్గ‌ట్టే ట్రైల‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టించింది. ట్రైల‌ర్ లో సాయిమాధ‌వ్ మార్క్ డైలాగులు అల‌రించాయి. వీర‌సింహారెడ్డి డైలాగులు కొంత పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకున్నాయ‌ని విమ‌ర్శ‌లొచ్చినా కానీ వాటిలో సాయిమాధ‌వ్ మార్క్ ఎక్క‌డా మిస్స‌వ్వ‌లేదు. ఎంతో డీసెంట్ గా పంచీగా డైలాగులు అల‌రించాయి. ``సంత‌కాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుందేమో కానీ..చ‌రిత్ర సృష్టించిన‌వాడి పేరు మారదు.. మార్చ‌లేరు! `` అంటూ బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు ట‌పాసుల్లా పేల్చారు.

ఇక ఇప్ప‌టికే వీర‌య్య వ్య‌వ‌హారం ఎలా ఉంటుందో ద‌ర్శ‌కుడు బాబీనే స్వ‌యంగా వెల్ల‌డిచారు. ముఠామేస్త్రి- రౌడీ అల్లుడు- గ్యాంగ్ లీడ‌ర్ లాంటి మాస్ సినిమాల స్ఫూర్తితో మెగా మేకోవ‌ర్ స‌ర్ ప్రైజ్ చేస్తుంద‌ని ముందే చెప్పేసాడు బాబి. దానికి త‌గ్గ‌ట్టే వీర‌య్య ట్రైల‌ర్ లో డైలాగుల్ని స‌న్నివేశాల్ని మెర్జ్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. ``మాస్ అనే ప‌దానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయ‌న్ని సూసే!``... ``రికార్డ్స్ లో నా పేరుండ‌టం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి!`` అంటూ బాబి స్వ‌యంగా అద్భుత‌మైన పంచ్ డైలాగుల్ని స్వ‌యంగా రాసాడు.

వీర‌సింహారెడ్డికి సాయిమాధ‌వ్ రాసిన పంచ్ లు మ‌రో లెవ‌ల్ అనుకుంటే .. వీర‌య్య కోసం బాబి అంతే టోన్ డౌన్ చేసి డైలాగుల్ని రాసారు. ఆస‌క్తిక‌రంగా ఎబ్బెట్టు అనిపించేంత చెత్త డైలాగులు ఈ రెండు సినిమాల్లో విన‌లేమ‌ని డైలాగుల ప‌రంగా ప‌రిణ‌తి క‌నిపిస్తోంద‌ని క్లాస్ అభిమానులు విశ్లేషిస్తున్నారు. మ‌రీ కంటి చూపుతో చంపేయ‌డమో లేదా కంటి చూపుతో రైలు వెన‌క్కి వెళ్లిపోవ‌డ‌మే ఈ రెండు సినిమాల్లో చూపించ‌లేద‌ని.. గొడ్డ‌లితో న‌రికితే ఆ త‌ల శిర‌స్సును వ‌దిలి వెళ్లి ఆకాశంలో చుక్క‌ల్లోకి వెళ్లిపోద‌ని అభిమానులు ఆశిస్తున్నారు!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News