పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎప్పుడూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ఎల్లపుడు ఏదోక ట్వీట్లతో వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఫాస్ట్ బౌలర్ గా పాకిస్థాన్ జట్టులో ఎన్నో మ్యాచ్లలో షోయబ్ సేవలందించారు. షోయబ్ రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు సినీరంగాలకు చెందిన ప్రముఖులు.. ఇలా అన్ని రంగాల ప్రముఖుల జీవిత కథల ఆధారంగా బయోపిక్ లు తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అయితే తాజాగా ఒకవేళ తన బయోపిక్ తెరకెక్కిస్తే తన పాత్రలో ఏ హీరో అయితే బాగుంటుంది? అనే ప్రశ్నకి ఆసక్తికర సమాధానం చెప్పాడు అక్తర్.
ఒకవేళ నా బయోపిక్ తెరకెక్కిస్తే నా పాత్రలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తప్ప మరెవరూ సెట్ అవ్వరు అంటూ చెప్పేసాడు.. సల్మాన్ ఖాన్ నా పాత్రలో నటిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా అని మనసులో మాట బయట పెట్టాడు. అయితే సల్మాన్ ఖాన్ ఎన్నో ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్నాడు. యాక్షన్ సినిమాలకు సల్మాన్ ఖాన్ కేరాఫ్ అడ్రస్. ఇదిలా ఉండగా ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే షోయబ్ అక్తర్ తాజాగా తన బయోపిక్ లో తన పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తే బాగుంటుందని చెప్పడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు కూడా భిన్నంగా స్పందిస్తున్నారు అని చెప్పాలి. మరి సల్మాన్ ఖాన్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.. షోయబ్ అక్తర్ బయోపిక్ లో నటించడానికి సల్మాన్ ఖాన్ ఓకే చేస్తాడా? అనేదే పెద్ద ప్రశ్న ఆసక్తిని కలిగిస్తుంది.