తెలుగు నటి .. తమిళ నటి.. హిందీ నటి అంటూ విడదీసి చూస్తే తనకు నచ్చదని తనను ఆల్ ఇండియన్ యాక్ట్రెస్ గా చూడాలని కోరుకుంటున్నానని ప్రియమణి అన్నారు. ప్రాంతాలతో విభేధాలు తగదని భారతీయ నటిగా గుర్తింపు కావాలని ఆశపడుతున్నట్టు వెల్లడించారు ప్రియా.
ఏ నటుడు లేదా నటి అయినా భారతదేశంలో ప్రాంతంతో గుర్తించబడటం సాధారణం. బాలీవుడ్ తారలు అనో తమిళ తారలు అనో.. కన్నడ తారలు అనో పిలుస్తాం కానీ భారతీయ నటీనటులుగా పిలవరు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను సాధారణంగా బాలీవుడ్ అని... సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అని గుర్తించడం కూడా సాధారణం.
అయితే ఈ విషయంలో ప్రియమణికి అభ్యంతరం ఉంది. సౌత్ ఇండియన్ నటి అని పిలవడం అంత కంఫర్ట్ గా లేదని భావిస్తోందట. మమ్మల్ని దక్షిణాది నటులు లేదా బాలీవుడ్ నటీనటులు అని ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు. మేమంతా భారతీయ నటులమే అని ఆమె అన్నారు.
ప్రియా ఉద్ధేశమేమంటే.. జయప్రద శ్రీదేవి వంటి భారతీయ నటీమణులుగా ముద్ర పడితే అది జాతీయ గుర్తింపు. చాలా మంది నటీనటుల ప్రతిభను అన్ని వేదికలపైనా గుర్తించడం నాకు చాలా సంతోషంగా ఉందని ప్రియమణి అన్నారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో వచ్చిన పాపులారిటీని కొనసాగిస్తూ పాన్ ఇండియా చిత్రాల్లో ప్రియమణికి ఆఫర్లు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆహాలో ప్రియమణి భామా కలాపం స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.