వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథాంశాల్ని ఎంచుకుంటూ తనకంటూ ఒక సపరేట్ రూట్ ఉందని నిరూపించింది తాప్సీ. బాలీవుడ్ లో అడుగుపెడుతూనే చక్కని విజయాల్ని ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఇటీవల పలు బయోపిక్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రలోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇవేవీ తాప్సీ అసలు కలలు కావు. రియాలిటీలో వేరొక కల ఉంది. దానిని సాధించుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఇంతకీ తాప్సీ కన్న ఆ కొత్త కల ఏమిటి? అంటే.. తనను తాను వెండితెరపై సూపర్ హీరోగా చూసుకోవాలని కలలుగంటోంది. తాను అవెంజర్ అవ్వాలనుకుంటోందట.
తాజాగా వోగ్ కవర్ పేజీపై దర్శనమిచ్చిన తాప్సీ ఇంటర్వ్యూలో ఈ హాటెస్ట్ అప్ డేట్ చెప్పింది. ఇంకా పేపర్ పైనే ఉంది. తాప్సీ సూపర్ హీరోగా కనిపించవచ్చు.
ఆమె కోరికల జాబితాలో తదుపరిది ఏమిటంటే.. అవెంజర్ అవ్వాలని కోరుకుంటున్నానని తాప్సీ అంగీకరించింది. కాబట్టి కెప్టెన్ మార్వెల్ గా ఆమె సంతకం చేసిన రోజు మిషన్ పూర్తవుతుంది. 22 మే 2021 వోగ్ ఇండియా మే-జూన్ 2021 సంచికలో పూర్తి విషయాల్ని వెల్లడించింది తాప్సీ. ఇక తాప్సీ ఇటీవలే పూణే బ్యాడ్మింటన్ టీమ్ యజమానురాలు అయ్యింది. పూణే-7 ఏసెస్ త్వరలో ప్రీమియర్ లీగ్ ఆడనుంది. అలాగే తన సోదరితో కలిసి షాగున్ - ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ పేరుతో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీని తాప్సీ విజయవంతంగా రన్ చేస్తోంది.
వోగ్ జూన్ కవర్ పేజీపై తాప్సీ లుక్ ని మనీష్ మల్హోత్రా అండ్ టీమ్ డిజైన్ చేశారు. 'నూరానియత్' సీక్విన్ స్లిప్ డ్రెస్, .. చెవిపోగులు,.. 18 కే బంగారు ఉంగరంలో సెమీ విలువైన రాయి సెట్.. తారా ఫైన్ జ్యువెలరీ .. ఎటర్నిటీ బ్యాండ్,.. డియోసా ఉంగరాలు.. ఇంత సెటప్ ఉంది. మితేష్ రజని కేశాలంకరణ చేశారు.