ఆ ఈవెంట్ లో లీటర్ నీళ్ళు.. రూ 100

Update: 2017-05-12 04:26 GMT
పాప్ సింగర్.. జస్టిన్ బీబర్.. భారత దేశ నాలుగు రోజుల పర్యటన లో కొన్ని అవాంతరాలు ఏర్పడి. ఇండియా లో ఇదే మొదటసారి అతను లైవ్ షో చేయటం.. అసలు అతని రాకాకోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తునట్లు మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు అది ఏది నిజం కాదు తేలింది. స్టార్ ఐతే మాత్రం సరిపోతుందా జనాలుకు నచ్చాలి కదా. జస్టిన్ తన టీమ్ కి కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు. దీనికి కారణం అతని పి‌ఆర్‌ ఓ టీమ్ చేసిన తప్పు వలన.

ఈ ఈవెంట్ లో ఉండవలిసిన కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. స్టార్స్ వస్తే వాళ్ళకి సెక్యూరిటి కూడా సరిగా ఏర్పాటు చేయలేదు. బిపాషా బసు లాంటి స్టార్ అక్కడ వాతావరణం చూసి 5 నిముషాలు ఉండి వెళ్లిపోయింది.  అక్కడి వెర్రిగా ఉన్న జనాన్ని అదుపులో పెట్టుకోవడంలో అతని టీమ్ విఫలం అయింది. ఇంకా అక్కడ తాగడానికి మంచి నీళ్ళ ఏర్పాటు చేయలేదు. అక్కడ వాటర్ బాటిల్ 100 రూ పెట్టి అమ్మేశారు. ఎం.ఆర్పి కే అమ్మాలని కోర్టులు మొత్తుకుంటున్నా కూడా.. జనాల అవసరాలను ఇలా క్యాష్‌ చేసుకుంటున్నారు ఈవెంట్ ఆర్గనైజనర్లు. ఇకపోతే విశ్రాంతి గదులు కాని అలాగే టాయిలెట్స్ ఫెసిలిటీలు కూడా సరిగా లేవట.

చాల ఇంటర్నేషనల్ ఈవెంట్ చేసిన జస్టిన్ బీబర్ ఇప్పుడు ఉన్నపలంగా బయలుదేరి వెళ్లిపోయాడు. ఒక గంట షో కోసం కేవలం 24 గంటలు ఇండియాలో ఉన్నాడంతే. మీడియా వాళ్ళను కూడా బీబర్ ను కలవడానికి లోపలికి రానివ్వలేదూ. ఒక ఈవెంట్ లో ఏమి జరగకూడదో అన్నీ జరిగాయీ.  మరి ఫారిన్ పాప్ సింగర్లు ఇప్పుడు మన దేశం గురించి ఏమనుకుంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News