నాని.. అఖిల్.. ప్రేమతో చిట్ చాట్

Update: 2017-12-19 11:34 GMT
క్రిస్మస్ వీకెండ్లో రసవత్తర బాక్సాఫీస్ పోరు చూడబోతున్నాం. నేచురల్ స్టార్ నాని.. అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఒక్క రోజు వ్యవధిలో బాక్సాఫీస్ దగ్గర తలపడబోతున్నారు. దీని గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అఖిల్ మీదికి నానిని వదలొద్దని దిల్ రాజును నాగార్జున అడిగినా ఒప్పుకోలేదని.. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు చెడాయని ప్రచారం జరిగింది. ఐతే ఈ రెండు సినిమాలకు చెందిన యూనిట్ సభ్యులు మాత్రం ఇది అసలు పోటీనే కాదని.. రెండు సినిమాలూ బాగా ఆడతాయని అంటున్నారు. ఇటు నాగ్.. అటు దిల్ రాజు ఇద్దరూ ఇదే మాట అన్నారు. ఇప్పుడు ఈ పోటీ విషయమై నాని కూడా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తనకు ‘హలో’ ట్రైలర్ బాగా నచ్చిందని.. అది చూసిన వెంటనే అఖిల్ కు ఫోన్ చేసి అభినిందించానని.. అలాగే ‘ఎంసీఏ’ ట్రైలర్ బాగుందంటూ అఖిల్ తో పాటు ‘హలో’ దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా తనకు కాల్ చేసి చెప్పారని నాగ్ తెలిపాడు. అందరూ అనుకుంటున్నట్లు తనకు.. అఖిల్ కు మధ్య పోటీ అనేదేమీ లేదని నాని అన్నాడు. తన ఉద్దేశం ప్రకారం ఎంసీఏ.. హలో రెండు సినిమాలూ హిట్టవుతాయని.. ఈ విషయమై తాను.. అఖిల్ చాట్ కూడా చేసుకున్నామని అతను చెప్పాడు. ఇద్దరం ప్రేమగా మెసేజులు పెట్టుకున్నామని.. ఇద్దరం ప్రేమగానే ఉన్నామని.. కొందరు మాత్రం కావాలనే లేని పోటీని సృష్టించారని నాని అన్నాడు.  తమ కాన్వర్జేషన్ అంతా పబ్లిక్ లో పెట్టాలని కూడా తాను ఒక దశలో ఆలోచించినట్లు నాని చెప్పాడు.
Tags:    

Similar News