కరోనాపై అవగాహణ కల్పించేందుకు సినీ ప్రముఖులు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వండి అంటూ ఎన్నో సందేశాలు ఇస్తున్నారు. ఇంట్లోంచి బయట అడుగు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అంటూ సినీ ప్రముఖులు వివిధ రూపాల్లో చెబుతున్నారు. ఈ సందర్బంగా సంగీత దర్శకులు తమ పాటలతో కరోనా పై అవగాహణ కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఒక పాటను ట్యూన్ చేసి చిరంజీవి.. నాగార్జున.. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్ లతో చిత్రీకరించి విడుదల చేసిన విషయం తెల్సిందే. ఇంకా కొందరు సంగీత దర్శకులు కూడా కరోనా వైరస్ పై పాటలు విడుదల చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనదైన శైలిలో కరోనా వైరస్ గురించి పాటను తీసుకు వచ్చాడు. అయితే ఇది స్టూడెంట్ నెం.1 సినిమాలో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటకు పేరడి అవ్వడంతో అందరిని ఆకర్షిస్తోంది.
క్లాసిక్ సాంగ్ అయిన స్టూడెంట్ నెం.1 ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాటను కరోనాకు అన్వయించి కీరవాణి పాడిన విధానం బాగుంది. లిరిక్స్ సింపుల్ గా తెలుగులో అర్థం అయ్యేలా ఉన్నాయి. ఇంట్లోనే ఉండండి ఇష్ట దైవంను ప్రార్ధిస్తూ ఉండండి.. అనుమానం వచ్చినప్పుడల్లా చేతులు కడుక్కుంటూ ఉండండి అంటూ పాటలో చెప్పారు.
Full View

ఇక డాక్టర్లు.. నర్సులు.. పోలీసులు.. శానిటైజేషన్ డిపార్ట్ మెంట్ కు కృతజ్ఞతలు చెబుతూ వారి గొప్పతనంను పాటలో చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ పాట కరోనాపై అవైరస్ నెస్ పెంచడం తో జనాలు ఇంటికే పరిమితం అవ్వాలనే మంచి సందేశం ఇస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ హిట్ పాట అవ్వడం వల్ల ఈ పాట ఎక్కువ మందికి రీచ్ అవుతుందని కూడా అంటున్నారు.