దీప్-వీర్ వెడ్డింగ్: వోటు మాత్రం సామ్ కే!

Update: 2018-11-16 05:02 GMT
సెలెబ్రిటీ వెడ్డింగ్ అంటేనే అదో హంగామా.  ఇక పెళ్ళికొడుకు.. పెళ్ళికూతురూ ఇద్దరూ కనుక ఫిలిం స్టార్స్ అయితే ఆ హడావుడి సాధారణంగా ఉండదు. సాధారణ ప్రేక్షకులతో పాటూ మీడియా కూడా ఆ మ్యారేజిపై అమితమైన ఆసక్తిని చూపిస్తుంది.  వివాహం వెన్యూ దగ్గరనుండి మొదలుపెట్టి.. పెళ్ళిలో వారు డ్రెస్సులు..ఆభరణాలు.. గెస్ట్ లిస్టు అన్నీ హాట్ టాపిక్కులే.  ఇప్పుడు దీపిక పదుకొనే-రణవీర్ సింగ్ పెళ్ళి విషయంలో అలానే జరుగుతోంది.

దీప్ వీర్.. దీప్ వీర్ కి షాదీ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. దీపిక పదుకొనే పెళ్ళిలో ధరించిన దుస్తులపై ఫ్యాషన్ ప్రియులు చర్చలు సాగిస్తున్నారు. ఇక బ్రైడల్ వేర్ విషయంలో రీసెంట్ గా పెళ్ళిచేసుకున్న ఇతర హీరోయిన్ల వెడ్డింగ్ కాస్ట్యూమ్ లను పోలుస్తూ ఎవరి డ్రెస్ బాగుందనే డిబేట్లు జరుగుతున్నాయి. ఈ లిస్టు లో దీపిక.. సోనమ్ కపూర్.. అనుష్క శర్మ.. బిపాషా బసు ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీలందరికంటే అక్కినేని వారి కోడలు పిల్ల సమంతాకు ఎక్కువమంది వోటేస్తున్నారు.

సమంతా-నాగ చైతన్యలు మొదట హిందూ సంప్రదాయం ప్రకారం తర్వాత క్రిస్టియన్ ఆచారం ప్రకారం రెండు సార్లు పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే.  హిందూ పెళ్ళిలో నాగచైతన్య గ్రాండ్ మదర్ చీరను ధరించింది. అఫ్ కోర్స్ దానికి మోడరన్ టచ్ ఇచ్చారనుకోండి.. అది వేరే విషయం. క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ లో కూడా సామ్ డ్రెస్ అదిరిపోయింది.  అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ వెడ్డింగ్ వేర్ ను సమంతా క్యారీ చేసిన విధానం..గ్రేస్..  ఆ ఎమోషనల్ టచ్.  ఎమోషనల్ అవుతూ సామ్ కంట లైట్ గా కనిపించిన తడి. అందుకే ఎంతమంది పోలికలు వచ్చినా ఎక్కువ వోట్లు మాత్రం రామలక్ష్మికేనట.
Tags:    

Similar News