మనవాళ్లకు విశ్వాసం ఇల్లే

Update: 2019-03-01 12:21 GMT
హెడ్డింగ్ చూసి ఇల్లే అంటే గృహం అనుకునేరు. ఇక్కడ వాడింది తమిళ పదం. ఇల్లే అంటే లేదు అని అర్థం. ఇవాళ కళ్యాణ్ రామ్ 118 తో పాటు విడుదలైన అజిత్ విశ్వాసం వీక్ ఓపెనింగ్స్ తో మొదలైంది. సరిగ్గా మూడు రోజుల క్రితం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అమెజాన్ ప్రైమ్ హెచ్డి ప్రింట్ రిలీజ్ చేయడం ఎంత లేదన్నా ప్రభావం చూపించినట్టుంది. చాలా చోట్ల సగం కూడా ఫుల్స్ కాలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అజిత్ మార్కెట్ ఇక్కడ ఏమంత ఆశాజనకంగా లేదు.

అక్కడ ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన వీరం-మన్కకతా లాంటి డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కనీస స్థాయిలో కూడా ఆడలేదు. అందుకే సైమల్టేనియస్ రిలీజ్ కు వాళ్ళు ఎప్పుడో స్వస్తి చెప్పారు. అందుకే విశ్వాసం తమిళనాడులో విడుదలైన సుమారు 50 రోజుల తర్వాత కానీ ఇక్కడ తెచ్చే సాహసం చేయలేకపోయారుఅయితే విశ్వాసంకు ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ దక్కలేదు. 118కు వచ్చిన డివైడ్ టాక్ పక్కన పెడితే దీనికీ ఏమంత ఉత్సాహవంతంగా కలెక్షన్లు లేవు.

రొటీన్ కథా కథనాలు ఉండటం అజిత్ హీరోయిజం ఎలివేషన్ తప్ప మిగిలిన తతంగమంతా రెగ్యులర్ మోడ్ లోనే కొనసాగడం మైనస్ గా చెప్పుకోవచ్చు. ఓ పాపకు జన్మనిచ్చాక హీరో హీరోయిన్ దూరం కావడం ఆ తర్వాత విలన్ వల్ల కలుసుకునే పరిస్థితి రావడం గతంలో ఎన్నో సినిమాల్లో చూసిందే. విశ్వాసం కూడా అదే లైన్ లో ఉండటంతో చూసిన కొద్దిమంది హ్యాపీగా బాగుందని చెప్పలేకపోతున్నారు. అటేమో ఇది వంద కోట్ల సినిమా. మనదగ్గర కనీసం పెట్టుబడి పెట్టిన మూడు కోట్ల మొత్తాన్ని తీసుకొస్తుందో లేదో చూడాలి
Tags:    

Similar News