వీర‌య్య అభిమానుల‌తో బాబి సీక్రెట్ మీటింగ్స్ ఏంటో?

Update: 2022-12-26 15:08 GMT
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'వాల్తేరు వీర‌య్య‌' రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న భారీ అంచ‌నాల మ‌ధ్య వీర‌య్య ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇక ప్ర‌చార ప‌రంగా మునుప‌టిలా ఎలాంటి త‌ప్పిదాలు దొర్ల‌కుండా ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే  లిరిక‌ల్ సింగిల్స్ ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేస్తున్నారు.

ఇంకా మ‌రిన్ని ప్ర‌చార చిత్రాలు  రిలీజ్ చేసి ఒక్క‌సారిగా భారీ హైప్ తీసుకోరావాల‌ని ప్ర‌త్యేక‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు. ఈనేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు బాబి ప్ర‌చారంలో భాగంగా త‌న‌దైన స్ర్టాట‌జీని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. చిరంజీవికి ఇచ్చిన మాటను నిల‌బెట్టుకోవ‌డం కోసం ఆయ‌నా ప్ర‌చార ప‌రంగా బాగానే శ్ర‌మిస్తున్నాడు. ఇటీవ‌లే  తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాల ప్రతినిధులతో స‌మావేశ‌మైన‌ట్లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఇది పూర్తిగా ర‌హ‌స్య స‌మావేశంలా క‌నిపిస్తుంది. మీడియాకి ఎలాంటి ఆహ్వ‌నం లేకుండా త‌మ‌లో తామే ర‌హ‌స్యంగా మంత‌నాలు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. థియేటర్లు.. బెనిఫిట్ షోల గురించి ఆ స‌మావేశంలో చ‌ర్చ‌కొచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  ఇందులో చిరంజీవి ఏకంగా ప‌ది  రోజుల పాటు భారీ వర్షంలో బోటు స‌న్నివేశాల్లో పాల్గొన్నారుట‌.

ఎముకులు కొరికే చ‌లిలో చిరు ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా ఎంతో క‌మిట్మెంట్ తో ఆ స‌న్నివేశాలుపూర్తి చేయంలో స‌హ‌క‌రించా ర‌న్నారు. డూప్ తో చేద్దా? అన్నా చిరంజీవి ఎలాంటి డూప్ అవ‌స‌రం లేద‌ని..సినిమాలో సీన్ ముఖ్య‌మా?  కాదా? అన్న‌ది ప‌క్క‌న‌బెట్టి సీన్ పేపర్లో ఉన్న‌ది  ఉన్న‌ట్లుగా య‌ధావిధిగా చేద్దామ‌ని..ఆ త‌ర్వాత ఫైన‌ల్ క‌ట్ లో అన్ని చూసుకుందామ‌ని రంగంలోకి దిగారుట‌.

చిరంజీవి అభిమాని చిరుని ఎలా అయితే తెర‌పై చూడాల‌నుకుంటారో? అంత‌కు రెండింత‌లు సినిమా....అందులో చిరంజీవి పాత్ర ఉంటుంద‌ని బాబి ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఈ  వ్యాఖ్య‌లు అభిమానుల్లో జోష్ ని నింపుతున్నాయి. వీర‌య్య‌నా..మ‌జాకానా? అంటూ  కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మా ఊర మాస్ వీర‌య్య‌ని థియేట‌ర్లో  వీక్షించ‌డానికి ఎదురుచూస్తున్నామంటూ!  పోస్ట్ లు పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News