సంజయ్ దత్ లక్ సినిమాతో పరిచయమైన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ చాలా ఏళ్ళు కష్టపడితే కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్నా పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ ఒక్క దెబ్బకు జాతకాన్ని మార్చేసింది. అది మొదలు రవితేజ బలుపు మహేష్ బాబు శ్రీమంతుడు ఒకటేమిటి ఇలా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ భారీగా కొట్టింది శృతి హాసన్. అందరు హీరోయిన్ల లాగే తనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయి దెబ్బలు పడటం వరస పరాజయాలు పలకరించడం జరిగిపోయాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ తో కాటమ రాయుడులో కనిపించాక తమిళ్ లో తో సహా ఏ బాషా సినిమాలోనూ శృతి హాసన్ లేదు. కానీ విదేశీ ప్రియుడిగా చెన్నై మీడియా ప్రచారంలో ఉన్న మైకేల్ కోర్సోల్ తో మాత్రం బయట కూడా బాగానే కనిపించింది. సుందర్ సి దర్శకత్వంలో సంఘ మిత్ర ఒప్పుకుని ఆ తర్వాత డ్రాప్ అయిపోయి చిన్నపాటి రచ్చ చేసాక మళ్ళి సినిమా వార్తల్లో కనిపించకుండా పోయింది. ఇటీవలే ముంబై లో జరిగిన ఒక ఫ్యాషన్ రాంప్ వాక్ లో పాల్గొన్న సందర్భంగా తన మనసులో మాట చెప్పింది శృతి హాసన్.
దాని ప్రకారం శృతి హాసన్ ఇకపై సినిమా నిర్మాణంతో పాటు మ్యూజిక్ వీడియోల పై పూర్తిగా దృష్టి సారిస్తుందట. ఇప్పటికే అమ్మ సారికతో కలిసి తమిళ్ హిందీలో చెరో సినిమా తీయడానికి రెడీ అవుతున్న శృతి అన్నంత పని చేసేలా ఉంది. కానీ ఇకపై మూవీస్ లో నటించే విషయం మాత్రం స్పష్టంగా చెప్పకుండా దాటవేసిన శృతి తనలాంటి ఆర్టిస్టులు అప్పుడప్పుడు ఇలాంటి గ్యాప్ తీసుకుంటే స్థిత ప్రజ్ఞత పెరుగుతుందని సెలవిచ్చింది. సంగీతం మీద ముందు నుంచి శృతికి మక్కువ ఎక్కువే. నాన్న కమల్ మన వెంకటేష్ తో కలిసి నటించిన ఈనాడుకు బీజీఎమ్ తో పాటు ట్యూన్ కట్టి పాట పాడింది శృతినే. అప్పటికి తను ఇంకా సౌత్ లో హీరోయిన్ గా ఎదగలేదు. తరచు ఆల్బమ్స్ చేస్తున్నా స్టార్ గా బిజీ అయ్యాక వాటిని మానేసిన శృతి మళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ అవతారం ఎత్తబోతుందన్న మాట. మరి ఫ్యాన్స్ కోసమైనా ఒకటో రెండో సినిమాలు చేస్తే బెటరేమో. కాటమ రాయుడు టైంలోనే లుక్స్ విషయంలో కామెంట్స్ అందుకున్న శృతి వాటిని సీరియస్ గా తీసుకుని మేకోవర్ చేసుకోవడం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న ఫోటోస్ లో కనిపిస్తూనే ఉంది.