భారీ హైప్ నడుమ `మహర్షి` ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతుంటే మరోవైపు నిర్మాత దిల్ రాజు కార్యాలయం.. ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఐటీ అధికారులు ఏకంగా 6 గంటలు పైగానే దిల్ రాజు కాంపౌండ్లు అన్నిటినీ వెతికి కొన్ని ఫైల్స్ ని సేకరించారట. అయితే ఆ సందర్భంలో రాజుగారి ఒరిజినల్ ఫీలింగ్ ఏంటి? అంటే కొన్ని ఆసక్తికర సంగతులే తెలిశాయి.
అసలు ఐటీ సోదాలు జరిగినంత మాత్రాన ఏం కొంపలంటుకుపోయినట్టు? అనేది రాజుగారి ప్రశ్న అని ఇన్నర్ గా టాక్ వినిపించింది. దీనిపై మీడియా చేసిన హంగామాపై ఆయన కాస్తంత సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఓవైపు సోదాలు జరుగుతుంటే.. దానిపై స్పందించిన దిల్ రాజు ఐటీ దాడులు కామన్ అంటూ లైట్ తీసుకున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ఇలాంటి దాడులు జరుగుతాయని అదేం పెద్ద విషయం కానే కాదనేది ఆయన అభిప్రాయం. దాదాపు 150 కోట్ల బిజినెస్ చేసిన మహర్షి సినిమా ప్రొడ్యూసర్ గా డిస్టిబ్యూటర్ గా వ్యవహరిస్తున్న రాజుగారు ఐటీ కట్టకుండా ఎగ్గొట్టారా? అంటూ మరోవైపు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. కానీ ఆ విషయంలో రాజుగారిలో ధీమా పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
అసలు ఐటీవాళ్లు దిల్ రాజునే ఎందుకు టార్గెట్ చేశారు? అంటే.. భారీ బడ్జెట్ తో సినిమా మేకింగ్ పూర్తి చేయడమే గాక భారీ బిజినెస్ చేశారని వార్తలొచ్చాయి. అలాగే టిక్కెట్టు రేట్లు పెంచి అమ్మకాలు సాగించడంతో వచ్చే ఆదాయాన్ని దాచేస్తున్నారా? అన్న కోణంలో కూడా ఐటీ అధికారులకు ఉప్పందిందని తెలుస్తోంది. ఇకపోతే దిల్ రాజు మాత్రం ఎంతో ధీమాగా కనిపిస్తూ.. ``నా సంస్థలో ఐటీ రిటర్న్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఆరుగంటల సోదాలో ఏదీ దొరకలేదు. ఇప్పటి వరకు ఏలాంటి అవకతవకలు జరిగినట్టు తేలలేదు`` అంటూ కూల్ గా చెప్పారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించానని వెల్లడించారు. మొత్తానికి ఐటీ దాడుల ఎపిసోడ్ అలా ముగిసిందని చెప్పుకుంటున్నారు. ఇకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు... ఎవడు సినిమాల రిలీజ్ టైమ్ లోనూ దిల్ రాజు కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. అయితే అప్పట్లో కేవలం రూ.2లక్షలు మాత్రం ఐటీ అధికారులకు చిక్కాయి. అప్పుడే ఎంతో జాగ్రత్తగా ఉన్న రాజుగారు ఇప్పుడెలా చిక్కుతారు? ఆయన గట్టి పిండం అంటూ మాట్లాడుకున్నారంతా. అయితే మహర్షి ఆఫీస్ పై దాడి విషయంలో ఐటీ శాఖ అధికారుల నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉందింకా. నేడు ప్రపంచవ్యాప్తంగా మహర్షి రిలీజైన సంగతి తెలిసిందే.