`బాహుబలి` సిరీస్ తరువాత ప్రభాస్ చిన్న ప్రాజెక్ట్ ల పైపు చూడకుండా బ్యాక్ టు బ్యాక్ వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాకే సై అంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తన తొలి మైథలాజీ మూవీ `ఆదిపురుష్` షూటింగ్ ని పూర్తి చేశారు. భారీ గ్రాఫిక్స్ నేపథ్యంలో రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ మూవీ షూటింగ్ ని రాకెట్ స్పీడుతో పూర్తి చేశారు.
గ్రాఫిక్స్ అత్యంత కీ రోల్ పోషించనున్న సినిమా కావడంతో దీనికి సంబంధించిన వర్క్ గత కొన్ని నెలలుగా జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ తో `సలార్` చేస్తున్నాడు. ఇది దాదాపు యాభై శాతం షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఇక మూడవ ప్రాజెక్ట్ గా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ `ప్రాజెక్ట్ కె` చేస్తున్నారు.
ఈ మూడు ప్రాజెక్ట్ లు కూడా ఒక్కొక్కటి వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ఆదిపురుష్ దాదాపు రూ. 500 కోట్లతో రూపొందుతుండగా ఇదే స్థాయి బడ్జెట్ తో `ప్రాజెక్ట్ కె`ని సిద్ధం చేస్తున్నారు. `సలార్`కు మాత్రం రూ. 200 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఈ బందల కోట్ల బడ్జెట్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ మినిమమ్ బడ్జెట్ సినిమా చేయాలని భావించిన ప్రభాస్ దర్శకుడు మారుతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే అనేక మలుపులు తిరుగుతూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు డీవీవీ దానయ్య నిర్మాత. ఇప్పటికే అడ్వాన్స్ కింద ప్రభాస్ కు రూ. 50 కోట్లు ఇచ్చారట.
అయితే ఇటీవల మారుతి డైరెక్ట్ చేసిన `పక్కా కమర్షియల్` ఫ్లాప్ కావడంతో ఆ అడ్వాన్స్ ని తిరిగి తీసుకున్నారని, మారుతి డైరెక్టర్ అయితే ఈ మూవీ తాను చేయలేనని చెప్పినట్టుగా ఇన్ సైడ్ న్యూస్. ఇక భారీ ప్రాజెక్ట్ లతో స్టార్ డమ్ ని పీక్స్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ కు ఈ దశలో మారుతి సినిమా కరెక్ట్ కాదని, అతని స్టార్ డమ్‌ని హ్యాండిల్ చేయడం అతని వల్ల కాదని భావిస్తున్నారట.
ప్రభాస్ చుట్టూ వున్న వాళ్లు ఈ విషయంలో తనని హెచ్చరిస్తున్న మారుతితో సినిమా చేస్తానని భీష్మించిన తనకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సాధరణ సినిమా కోసం అంటూ కెరీర్ తో జూదం ఆడటం ఎందుకని కూడా ప్రభాస్ కు చాలా మంది చెబుతున్నారట. దీంతో ప్రభాస్ కూడా పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే దాయన్య కానీ, మారుతి కానీ పెదవి విప్పాల్సిందే.