అందాలముద్దుగుమ్మలు రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం "శాకిని డాకిని". రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మగవాళ్లకు మ్యాగీతో కంపేర్ చేస్తూ చెప్పిన '2 మినిట్స్' అడల్ట్ జోక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
'అబ్బాయిలు - మ్యాగీ రెండూ ఒకటే. ఎందుకంటే రెండూ 2 నిమిషాల్లో అయిపోతాయి' అంటూ రెజీనా సంచలన వ్యాఖ్యలు చేసింది. డబుల్ మీనింగ్ తో ఆమె మాట్లాడిన వీడియో బైట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అయితే రెజీనా కామెంట్స్ పై లేటెస్టుగా హీరో అడివి శేష్ సెటైర్ వేసే ప్రయత్నం చేశారు.
'శాకిని డాకిని' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అడివి శేష్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. టాలెంటెడ్ హీరో ఈ సందర్భంగా రెజీనా వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. "ఈ మధ్య మ్యాగీస్.. మగవాళ్ళుఅంటూ ఏదో మాట్లాడుతున్నావ్. నేను ఎందుకు అడుగుతున్నాను అంటే.. నేను సినిమాలను పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటానని.. నాకు స్టామినా ఎక్కువ అని నందినీ రెడ్డితో సహా చాలా మంది అంటుంటారు. ఏంటీ.. నువ్వు మ్యాగీస్ అంటూ మగవాళ్లను తిడుతున్నావ్?" అని శేష్ నవ్వుతూ ప్రశ్నించారు.
దీనికి రెజీనా స్పందిస్తూ.. "వినలేదా మీరు? అయితే 2 మినిట్స్ లో చెప్తా.." అని పెద్దగా నవ్వుతూ బదులిచ్చింది. ఆ తర్వాత 'జస్ట్ కిడ్డింగ్' అంటూ శేష్ ఆ టాపిక్ ని డైవర్ట్ చేసాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న నివేదా థామస్ కూడా నవ్వుతూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. 'ఎవరు' సినిమాలో తనతో కలిసి నటించిన రెజీనాతో ఉన్న చనువుతోనే శేష్ ఇలా ఆమెను ఆట పట్టించే ప్రయత్నం చేశారు.
కాగా, 'శాకిని డాకిని' చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఇది 'మిడ్ నైట్ రన్నర్స్' అనే సౌత్ కొరియన్ యాక్షన్ కామెడీ చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించి. ఇందులో అండ ఉత్పత్తి మరియు అద్దె గర్భం (సరోగసి) వంటి తీవ్రమైన సమస్యలను డీల్ చేస్తున్నారని ట్రైలర్ ని బట్టి అర్థమవుతోంది.
సురేష్ ప్రొడక్షన్స్ - గురు ఫిల్మ్స్ - క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై డి. సురేష్ బాబు - సునీత తాటి - హ్యూన్వూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ ను నిర్మించారు. మిక్కీ ఎంసీ క్లియరీ సంగీతం సమకూర్చగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్న 'శాకిని డాకిని' సినిమా.. సెప్టెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.