మహేష్ మళ్ళీ క్లాసులు తీసుకుంటాడా ?

Update: 2019-05-31 17:30 GMT
ఇవాళ లాంచనంగా మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రారంభమయ్యింది . హీరో లేకపోయినా హీరొయిన్ రష్మిక మందన తో సహా టీం మొత్తం తతంగాన్ని పూర్తి చేసారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలాఖరు నుంచి స్టార్ట్ కానుంది. ఇదిలా ఉండగా ఇందులో స్టొరీ లైన్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అప్పుడే హాట్ హాట్ గా మారాయి. మిలిటరీ బ్యాక్ డ్రాప్ నుంచి సీమకు వచ్చి ఇక్కడ ఫ్యాక్షన్ ని అంతం చేసే పాత్రను దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ ని మిక్స్ చేస్తూ రాసుకున్నాడని గట్టిగా వినిపిస్తోంది.

అంటే ఈసారి కూడా మహేష్ సందేశాలు చెప్పడం ఖాయమని అర్థమవుతోంది. గత కొన్నేళ్ళుగా ప్రిన్స్ దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదే. శ్రీమంతుడులో ఊళ్ళను దత్తత తీసుకోవడం గురించి భరత్ అనే నేనులో రాజకీయ నాయకుల బాద్యతల గురించి మహర్షిలో రైతులు వ్యవసాయం గురించి కావలసినంత మెసేజీలు పొందుపరిచారు .ఇప్పుడు సీమ ఫ్యాక్షనిజం వంతు వచ్చింది. ఇది నిజమో కాదో కాని ఖచ్చితంగా చెప్పలేం కాని లీకైన న్యూస్ ని బట్టి నమ్మదగినదిగానే ఉంది.

నిజానికి మహేష్ ఇండస్ట్రీ హిట్స్ దేనిలోనూ సందేశాలు ఉండవు. ఒక్కడులో ప్రకాష్ రాజ్ పక్కా ఫ్యాక్షనిస్టు. కాని హీరో తన ప్రేమను గెలిపించుకుంటాడు తప్ప కత్తులు వదిలేయండని క్లాసులు పీకడు. పోకిరిలో మాఫియా కోరలు పీకేస్తాడు కాని యువతను పోలీస్ శాఖకు రమ్మని లెక్చర్లు ఇవ్వడు. మురారిలో చూసినా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూసినా దేంట్లోనూ ఎవరికి ఉపదేశాలు ఉండవు. బిజినెస్ మెన్ తో మొదలుపెట్టి మహేష్ ఈ స్టైల్ లోకి వచ్చాకే తన రేంజ్ సక్సెస్ పూర్తి స్థాయిలో అందుకోలేక కలెక్షన్స్ విషయంలో కామెంట్స్ అందుకుంటున్నాడు. మరి అనిల్ రావిపూడి అయినా ఈ ట్రెండ్ కి బ్రేక్ వేస్తాడేమో చూడాలి


Tags:    

Similar News