మెగాబాస్ చిరంజీవి ఇటీవలే 'వాల్తేరు వీరయ్య' ప్రీరిలీజ్ వేదికపై ఓ మాటన్నారు. నాలుగున్నర దశాబ్ధాల అనుభవం ఉన్నా కానీ ఇప్పటికీ సీన్ లో నటించేందుకు వెళ్లే ముందు గుండెల్లో సన్నగా ఒణుకు పుడుతుందని చెమటలు పట్టేస్తాయని అయితే దానిని మేకపోతు గాంభీర్యంతో కప్పిపుచ్చుతామని చెప్పారు. నిజానికి వేదికపై ఆయన అన్న ఆ మాట అందరి గుండెల్ని సూటిగా తాకింది. ముఖ్యంగా ఆర్టిస్టు అయిన ప్రతి ఒక్కరి సన్నివేశం ఇంచుమించు ఇలాగే ఉంటుందా? అన్న సందేహాలు కలిగించింది. సెట్లో ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి అలాంటి పరిస్థితే ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. ముంబై పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా గొప్ప ఎంటర్ ప్రెన్యూర్ గా పాపులారిటీ ఉన్న కింగ్ ఖాన్ షారూఖ్ సినిమాలో నటించడం అంటే ఆషామాషీనా? అందునా ఒక దక్షిణాది నటుడిగా సేతుపతికి ఖాన్ సినిమాలో అవకాశం రావడం అటుంచితే.. అతడితో సన్నిహితంగా మెలిగే సన్నివేశాల్లో నటించాల్సి వస్తే... నిజానికి ఆ సీన్ లో అతడి పరిస్థితిని ఊహించాలి.
షారూఖ్ - అట్లీ కాంబినేషన్ మూవీ 'జవాన్' లో సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో సేతుపతి మాట్లాడుతూ .. తాను కూడా మొదటి రోజు ఖాన్ ని సెట్లో కలిసినప్పుడు నెర్వస్ గా ఉన్నానని తెలిపాడు. అయితే షారూఖ్ తనను చాలా సౌకర్యంగా ఉండేలా చేసారని అన్నారు. తనతో సన్నివేశాల గురించి చర్చించమని షారుఖ్ ఎప్పుడూ ప్రోత్సహించేవారని కూడా గుర్తు చేసుకున్నారు.
''అతను(షారూఖ్) చాలా స్వీట్. ఈ సినిమా చేయడం చాలా మంచి అనుభవం. మొదటి రోజు నేను కొంచెం నెర్వస్ అయ్యాను. ఎందుకంటే ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్. కానీ నేను చాలా సౌకర్యంగా ఉండేట్టు చేసాడు. నన్ను ఏవిధంగా ఇబ్బందికి గురి చేయలేదు. ఏదైనా ఒక సన్నివేశం ఉంది అంటే ముందుగా నాకు సుఖంగా ఉండడానికి ఆయన కావాల్సిన సహకారం అందించారు. హీ ఈజ్ స్వీటెస్ట్. నేను షారూఖ్ జీతో చర్చించగలను... అతను ఒక పెద్దమనిషి.. నేను షారూఖ్ సర్ తో మంచి సమయాన్ని గడిపాను'' అని తెలిపారు.
''అట్లీ - షారూఖ్ సర్ లతో కలిసి జవాన్ లో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖాన్ పక్కా పెద్దమనిషి. చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నాననేది ఎప్పుడూ చూపించడు. నేనే సూపర్ స్టార్ ని అనే అహం ఉండదు.. నేను నా సహ నటులతో ఎలా పని చేస్తానో అదే విధంగా ఆయనతో (సీన్స్) డిస్కస్ చేయగలను. ఆపై కొన్నిసార్లు నేను ''సారీ సార్.. నేను మీకు ఆటంకం కలిగిస్తే'' అని చెప్పేవాడిని. వద్దు విజయ్.. డ్యూటీ చెయ్ చాలు! అనేవారు. నేను అతనితో చాలా సౌకర్యంగా ఉన్నాను అని తెలిపారు.
జవాన్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ లతో కూడిన భారీ చిత్రంగా తెరకెక్కుతోంది. షారూఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ దీనిని నిర్మిస్తోంది. ఈ చిత్రం హిందీ- తమిళం- తెలుగు- మలయాళం- కన్నడ (ఐదు) భాషల్లో జూన్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అభిమానులు విజయ్ ని తదుపరి రాజ్ నిడిమోరు- కృష్ణ డికె రూపొందిస్తున్న ప్రైమ్ వీడియో సిరీస్ ఫర్జీలో చూస్తారు. సేతుపతితో పాటు ఇందులో షాహిద్ కపూర్- రాశి ఖన్నా- కే కే మీనన్- అమోల్ పాలేకర్ - భువన్ అరోరా కూడా నటించారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 10న ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. కత్రినా కైఫ్ తో సేతుపతి తదుపరి థ్రిల్లర్ చిత్రం 'మెర్రీ క్రిస్మస్' చిత్రీకరణ దశలో ఉంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ- తమిళ భాషల్లో ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
షారుఖ్ ఖాన్ తదుపరి 'పఠాన్'లో కనిపించనున్నారు. ఇందులో అతడు ఒక గూఢచారి పాత్రలో నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. పఠాన్ లో దీపికా పదుకొనే- జాన్ అబ్రహం- డింపుల్ కపాడియా- అశుతోష్ రానా తదితరులు నటించారు. ఈ చిత్రం జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. తాప్సీ పన్నుతో కలిసి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'డుంకీ' చిత్రంలోను షారూఖ్ నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.