టాలీవుడ్ లో వున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఇప్పటికే తన సహ హీరోలు రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్ పెళ్లి చేసుకుని సెటిలైపోయారు. అయితే ఇప్పటికీ ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి స్పష్టం చేయడం లేదు అంటూ తరచూ నెట్టింట ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. 'బహుబలి' తరువాత వివాహం చేసుకుంటానని కుటుంబ సభ్యులకు మాటిచ్చిన ప్రభాస్ ఆ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పెళ్లి ఊసెత్తడం లేదని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు.
భీమవరం అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని కొంత కాలం ప్రచారం జరిగితే ప్రభాస్ హీరోయిన్ ని వివాహం చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఇక ఇటీవల 'రాధేశ్యామ్' రిలీజ్ సమయంలో ప్రభాస్ కుటుంబ సభ్యులు అతని పెళ్లి కోసం అందరిలా మేము కూడా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా వుంటే తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్ లు చేశారు.
మీరు ఎక్కడికి వెళ్లినా ప్రతీ ఒక్కరూ పెళ్లి గురించి అడుగుతుంటారు కదా? ఆ మాటలు విన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఫీలయ్యారా? అని ప్రభాస్ ని ప్రశ్నించారు. అయితే దీనికి చాలా కూల్ గా సమాధానం చెప్పుకొచ్చారు ప్రభాస్. నా వివాహం గురించి ప్రేక్షకులు అడిగే అస్సలు ఫీలవ్వనని, వాళ్లు నా పెళ్లి గురించి ఆందోళనపడుతున్నారని అర్థం చేసుకుంటానన్నారు. అంతు కాకుండా ఇది చాలా సింపుల్ ప్రశ్న అని, నేను వారి స్థానంలో వున్నా ఇలాగే ఆందోళనపడేవాడినని స్పష్టం చేశారు.
ఈ సమాధానం విన్న యాంకర్ 'మీరు పెళ్లి ఫలానా టైమ్ లోనే చేసుకోవాలని ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అని అడిగితే .. ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు తప్పకుండా పెళ్లిని ప్రకటిస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ సమాధానంపై పలువురు పలు రకాలుగా అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదైనా ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదని, ఆయన సమాధానాన్ని బట్టి అర్థమవుతోందని అంటున్నారు.
ప్రభాస్ రీసెంట్ గా 'రాధేశ్యామ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. రాధాకృష్ణకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ అనూహ్యంగా భారీ నష్టాలనే అందించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా భారీ స్థాయిలో విఫలం కావడంతో ప్రభాస్ అభిమానులు చాలా డిజప్పాయింట్ అయ్యారట. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్', ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాల్లో నటిస్తున్నారు. 'స్పిరిట్' త్వరలో ప్రారంభం కానుంది.