విజ‌య్ `వాట్ ద ఎఫ్` లిరిక్స్ పై వివాదం!

Update: 2018-07-26 09:54 GMT
`అర్జున్ రెడ్డి`తో యంగ్ హీరో విజయ్ దేవరకొండకు విప‌రీత‌మైన పాపులారిటీ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పోస్ట‌ర్ వివాదం...ఆ త‌ర్వాత‌....సినిమాలో....ఓ డైలాగ్....ప్ర‌మోష‌న్ ఈవెంట్లో విజ‌య్....వాట్ ద ఎఫ్ ....అంటూ స్టేజీమీద చెప్పిన డైలాగ్....వివాదాస్ప‌ద‌మైన విష‌యం విదిత‌మే. అయితే, త‌న అప్ క‌మింగ్ మూవీ `గీత గోవిందం`లో విజ‌య్ తో పాటు ఆ `ఎఫ్`ప‌దం వివాదం కూడ‌ ట్రావెల్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ సినిమా కోసం విజ‌య్ `వాట్ ద ఎఫ్ `అంటూ విజ‌య్ పాడిన పాట తాలూకు లిరిక్స్ వివాదాస్ప‌ద‌మ‌య్యేలా క‌నిపిస్తున్నాయి. తాజాగా విడుద‌లైన  ఆ పాట లిరిక‌ల్ వీడియో....ఓ మతం మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉండ‌డంతో ఆ పాట‌పై వివాదం చెల‌రేగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. హిందువులు అతి ప‌విత్రంగా ఆరాధించే సీతా దేవి - స‌తీ సావిత్రిల‌పై ఆ పాట‌లోని ప‌దాలు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయంటూ సోష‌ల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

'గీత గోవిందం' సినిమాలో విజ‌య్ స్వ‌యంగా పాడిన `వాట్ ద ఎఫ్`పాట లిరిక‌ల్ వీడియో ను తాజాగా రిలీజ్ చేశారు. రికార్డింగ్  స్టూడియోలో విజ‌య్ పాడుతున్న వీడియో కూడా ఆ పాట‌లో క‌నిపిస్తుంది. ``అమెరికా గాళ్ అయినా . . అత్తిలి గాళ్ అయినా .. యూరప్ గాళ్ అయినా .. యానాం గాళ్ అయినా.....అమ్మాయిలంటేనే ట‌ప్ఫూ....ఆళ్ల తిక్క‌కు మ‌న‌మే స్టప్ఫు...దానికి నేనే ప్రూ ఫు....వాట్ ద వాట్ ద ఎఫ్ ....అంటూ ఆ పాట సాగుతోంది" అంటూ ఈ పాట జోరుగా సాగింది. అయితే, ఆ పాట మ‌ధ్య‌లో ....``రాముడు గాని ఇప్పుడు పుట్టి....జంగ‌ల్ కు పోదాం రార‌మ్మంటే....సీత‌కు కాస్త సిరాకు లేసి సోలోగానే పొమ్మంటాదే....య‌మ‌పాశంతో య‌ముడే వ‌చ్చి నీ పెనిమిటి ప్రాణం తీస్తానంటే....,నెట్ ఫ్లిక్స్ చూస్తూ ఈ సావిత్రి....లేటేంటంటూ కుమ్మేస్తాదే....మ‌గాళ్ల‌కి గోల్డెన్ డేసు పురాణాల్లోనే బాసు....`` అంటూ ఆ పాట సాగుతోంది.

అయితే, గోపీసుందర్ సంగీతంలో శ్రీమణి ర‌చించిన ఆ పాట‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీత‌, సావిత్రిల ఖ్యాతిని అప‌హాస్యం చేసేలా ఆ పాట లిరిక్స్ ఉన్నాయంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. హిందువులు సాఫ్ట్ టార్గెట్ అయ్యార‌ని...అందుకే ఈ త‌ర‌హా లిరిక్స్  - వివాదాలు వ‌స్తున్నాయ‌ని ప‌లు హిందు సంస్థ‌లు మండిప‌డుతున్నాయి. మ‌రోవైపు, రాముడిపై క‌త్తి మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌లు....ఆ త‌ర్వాత మ‌హేష్ - ప‌రిపూర్ణానంద స్వామి ల న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే ...మ‌రోసారి హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తినేలా ఈ పాట ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏ మతం వారి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నా తాము స‌హించ‌బోమ‌ని...క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ - కేటీఆర్ - డీజీపీలు స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ స‌ర్కార్....ఈ పాట‌పై  - చిత్ర యూనిట్ పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందా? లేదా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News