కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిని ఏ ఒక్కరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆయన మృతి చెంది వారం అవ్వబోతున్నా కూడా ఇంకా కూడా పునీత్ మృతి వార్త కొందరికి నమ్మశక్యంగా లేదు. ఆయన ఇంకా బతికే ఉన్నాడేమో అంటూ చాలా మంది బ్రమలో ఉన్నారంటూ కన్నడ సినీ ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఏ టీవీ ఛానెల్ పెట్టినా కూడా పునీత్ రాజ్ కు మార్ కు సంబంధించిన సినిమా లు ఏదో ఒకటి ఏదో ఒక సమయంలో టెలికాస్ట్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన మృతిని ఎలా జీర్ణించుకోవాలంటూ అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పెద్ద ఎత్తున పునీత్ రాజ్ కుమార్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలను దక్కించుకున్న సందర్బాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇప్పుడు వాటి విడుదలకు సంబంధించిన విషయాలు కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
పునీత్ రాజ్ కుమార్ నటించిన ధ్వైత సినిమా ఈ డిసెంబర్ లో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈలోపు ఆయన మృతితో చిత్ర యూనిట్ సభ్యులు ఏం చేయాలో పాలుపోక కన్నీరు పెట్టుకున్నంత పని చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ధ్వైత సినిమా లోని ఒక యాక్షన్ సన్నివేశంను చేయాల్సి ఉంది. ఆ సన్నివేశం లేకుండానే సినిమాను విడుదల చేయవచ్చు కాని.. ఆయన డబ్బింగ్ చెప్పకుంటే సినిమా ఎలా విడుదల చేయాలని మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఇన్నాళ్లు పునీత్ రాజ్ కుమార్ వాయిస్ తో ఆయన సినిమాలను చూసిన అభిమానులు ఆయన వాయిస్ కాకుండా మరే వాయిస్ వచ్చినా కూడా ఖచ్చితంగా సినిమాను తిరష్కరిస్తారు. అసలు ఆ సినిమాను కనీసం అంగీకరించరేమో అనే ఆందోళన మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ లా డబ్బింగ్ చెప్పే వారితో చెప్పించినా కూడా కష్టమే అనే భావన నిర్మాతల్లో వ్యక్తం అవుతోంది. అందుకే ముంబయికి చెందిన ప్రముఖ సౌండ్ స్టూడియోను ధ్వైత చిత్ర యూనిట్ సభ్యులు సంప్రదించారట.
షూటింగ్ సమయంలో పునీత్ రాజ్ కుమార్ చెప్పిన డైలాగ్స్ తోనే సినిమాను విడుదల చేయబోతున్నారట. అంటే ఆన్ లొకేషన్ డైలాగ్స్ నే రికార్డింగ్ స్టూడియోలో క్లీయర్ చేసి వాటిని మరింత క్వాలిటీగా క్లారిటీగా వచ్చేలా తీర్చి దిద్ది ధ్వైత సినిమాను పునీత్ రాజ్ కుమార్ వాయిస్ తోనే విడుదల చేయాలని భావిస్తున్నారట. అయితే ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ లో సినిమా విడుదల సాధ్యం కాదని వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేస్తారని అంఉటన్నారు. పునీత్ నటించిన మరో సినిమా జేమ్స్. ఈ సినిమా పునీత్ కు చివరి సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమా కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి కాలేదు. దాంతో చిత్ర యూనిట్ సభ్యులు ఏదో విధంగా మ్యానేజ్ చేసి విడుదల చేయాలని.. ధ్వైత సినిమా కు వాడిన టెక్నిక్ తోనే డబ్బింగ్ పూర్తి చేయాలని జేమ్స్ మేకర్స్ కూడా భావిస్తున్నారట. ఈ రెండు సినిమాల్లో ఒకటి వచ్చే ఏడాది పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్బంగా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.