నా 25లో అడ‌గ‌నిది 50లో అడగొద్దు! లోదుస్తుల్లో అందాల్ని ప్ర‌ద‌ర్శిస్తే త‌ప్పేంటి?

Update: 2021-05-21 23:30 GMT
మ‌న‌సుండాలే కానీ వ‌య‌సుతో ప‌నేంటి? 50 వ‌య‌సులో లింగ‌రీ దుస్తుల్లో అందాల్ని ప్ర‌ద‌ర్శించ‌డంలో త‌ప్పేంటి?  టాప్ మోడ‌ల్ కం గ్రేట్ చెఫ్ ప‌ద్మాల‌క్ష్మీ ప్ర‌శ్న ఇది. 50 ఏళ్ల పద్మ లక్ష్మి లోదుస్తుల ఫోటోలను సోష‌ల్ మీడియాల్లో పోస్ట్ చేయడాన్ని సమర్థించారు. నేను అందంగా కనిపించడం గర్వంగా ఉందని అన్నారు.

మీరు హాట్ ఫోటోలను ఆనందించకపోతే అది మీ దుర‌దృష్టం అని టాప్ చెఫ్ కం హోస్ట్ పద్మాల‌క్ష్మి ప‌రోక్షంగా త‌న అభిప్రాయం చెప్పారు. `ది కట్‌` మ్యాగ‌జైన్ కు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో రచయిత - టెలివిజన్ స్టార్ చెఫ్ ది గ్రేట్ ల‌క్ష్మి చాలా సంగ‌తులే మాట్లాడారు.

లక్ష్మి ఇంకా ఏమ‌న్నారంటే.. నేను నా సెక్సీ ఫోటోని పోస్ట్ చేస్తాను. నేను అందంగా కనిపిస్తున్నందుకు గర్వపడతాను. ఎందుకంటే నేను పని చేస్తున్నానా లేదా ఇంకేదో చేస్తున్నానా.. దానితోనే నేను సాంత్వ‌న పొందుతాను. నేను లోదుస్తులు మోడల్ ను. నేను 23 లేదా 24 లేదా 25 ఏళ్ళ వయసులో లోదుస్తులు ధరించిన‌ప్పుడు ఎవ్వరూ ప్రతికూలంగా మాట్లాడ‌లేదు. 50ఏజ్ లో అలా చేస్తే ఇప్పుడు ఎందుకు ప్ర‌శ్నిస్తున్నారు? అని సూటిగానే అడిగారు.

తన శరీరం గురించి మాట్లాడే వారి గురించి స్వేచ్ఛ‌గా త‌న అభిప్రాయం చెప్పారు. స్త్రీ శరీరాన్ని క్రమబద్ధీకరించడం సౌకర్యంగా ఫీల‌య్యేవాళ్లుంటారు. కొంద‌రు మహిళల శరీరసౌష్ఠ‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ గురించి చట్టాలు రూపొందించడం ఆనందిస్తారు. వారు జాతీయ స్థాయిలో ఎప్పుడూ నాతో కలవలేదు లేదా న‌న్ను చూడలేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఒక  పిల్లల ఆట ఆడుతారు ఈ విమ‌ర్శ‌కులంతా!అని ప‌ద్మా ల‌క్ష్మీ అన్నారు.

90 వ దశకంలో పాతిక ప్రాయంలో ప‌ద్మా లక్ష్మీ `ఎల్లే ఇటాలియా`..` డిజైనర్ రాబర్టో`కి అంబాసిడ‌ర్ గా ప‌ని చేశారు. 2012 లో లోదుస్తులతో ప్లేబాయ్ కోసం పోజులిచ్చారు. ఆమె ఇన్ స్టాగ్రామ్ పేజీ తన మోడలింగ్ రోజులు గడువు ముగియలేదని రుజువు చేస్తుంది. మార్చిలో ఆమె కోబాల్ట్-బ్లూ బికినీలో విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. ఈ నెలలో బ్రా - లోదుస్తుల సెట్ ధరించిన ఫోటోని రివీల్ చేశారు. లక్ష్మికి వృద్ధాప్యం గురించి తెలీదు. తన బికినీల‌ను విరమించుకోవాల్సిన‌ అవసరం త‌న‌కు లేదు. ``ఒక వ్యక్తిగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది.. అంటూ 2018లో ఓసారి బికినీ ఫోటోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.

నిజం చెప్పాలంటే నా 20 ఏళ్ళ ఏజ్ లో.. ఆ త‌ర్వాత‌ తల్లి పాలిచ్చిన వ‌య‌సులో కంటే నేను ఇప్పుడు నా శరీర అందం చాలా బావుంద‌ని భావిస్తున్నాను. నేను ఇకపై అభద్రతతో బాధపడను.. అంటూ ప‌ద్మాల‌క్ష్మీ ఏజ్ మ్యాట‌ర్ ప్ర‌స్థావించారు. ఈ వ‌య‌సులో త‌న ప్ర‌ద‌ర్శ‌న గురించి ఎవ‌రూ బెంగ పెట్టుకోవాల్సిన ప‌నే లేద‌నేది త‌న ఉద్ధేశం.
Tags:    

Similar News