బిగ్ బాస్ 6 స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

Update: 2022-06-22 08:34 GMT
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు మొదట చాలానే వచ్చాయి. కానీ ఆరంభం ఎన్టీఆర్ తో ఉండడంతో తెలుగులో మంచి రెస్పాన్స్ అందుకుంది.

రేటింగ్ గట్టిగానే వస్తుండడంతో పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా బిగ్ బాస్ షోతో నిర్వాహకులు మంచి బిజినెస్ చేస్తున్నారు. ఇటీవల నాన్ స్టాప్ అంటూ ఓటీటీ లోకి కొత్త తరహా బిగ్ బాస్ షోను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

మొదట్లో ఆ షోకు పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో అటు ఇటుగా మార్చేసి మళ్ళీ డైలీ ఎపిసోడ్స్ వదిలి సక్సెస్ అయ్యేలా చేశారు. ఏదేమైనా బిగ్ బాస్ కు పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా నిర్వాహకులు బిజినెస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక త్వరలో సీజన్ 6 కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఆ మధ్య  సెప్టెంబర్ లోనే బిగ్ బాస్ 6ను స్టార్ట్ చేయనున్నట్లు ఒక క్లారిటీ వచ్చింది.

ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ 6వ సీజన్ మొదటి ఎపిసోడ్ ఏ డేట్ కు స్టార్ట్ అవుతుంది అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్ 4వ తేది నుంచి బిగ్ బాస్ న్యూ టెలివిజన్ సీరీస్ స్టార్ట్ అవ్వనుందట. ఇప్పటికే కంటెస్టెంట్స్ విషయంలో నిర్వాహకులు ఒక క్లారిటికి వచ్చినట్లు సమాచారం. ఎక్కువగా టెలివిజన్ సెలబ్రెటీలను తీసికు రావడానికి ప్రయత్నం చేస్తున్నారట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కోసం అనిల్, మిత్రవ్, శివ, అమర్‌దీప్, ఆది, చైత్ర రాయ్, దీప్తి పిల్లి, నవ్య అవామీ, వర్షిణి అలాగే యాంకర్ ధనుష్ ఇలా కొందరు బిగ్ బాస్ లో పోటీదారులుగా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

ఈసారి అంతకుమించి అనేలా ఎంటర్టైన్మెంట్ అందించాలని అనుకున్నారట. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు7 నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
Tags:    

Similar News