`గూఢ‌చారి` సీక్వెల్ ఎప్పుడు?

Update: 2019-08-03 06:05 GMT
`గూఢ‌చారి` బ్లాక్ బ‌స్ట‌ర్ వెన‌క హీరో అడివి శేష్ ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం గురించి చాలానే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ర‌చ‌యిత‌గా .. ద‌ర్శ‌క‌హీరోగా శేష్ కి క‌మాండ్ ఉంది. అది ఈ సినిమాకి ఎంతో ఉప‌యోగ‌ప‌డింద‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప‌రిమిత బ‌డ్జెట్ లో టెక్నిక‌ల్ మాస్ట‌ర్ క్లాస్ సినిమా తీశార‌ని కాంప్లిమెంట్లు ద‌క్కాయి. కింగ్ నాగార్జున స‌హా ఇండ‌స్ట్రీ పెద్ద‌లంతా ఈ సినిమా సాధించిన స‌క్సెస్ చూశాక ద‌ర్శ‌క‌హీరోలు శ‌శి కిర‌ణ్ తిక్క‌- శేష్ ల‌ను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. స్పై థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో గూఢ‌చారి చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అందుకే అలాంటి క్రేజీ సినిమాకి సీక్వెల్ వ‌స్తే చూడాల‌న్న ఆస‌క్తి ప్రేక్ష‌కాభిమానుల్లో ఉంది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ `గూఢచారి` సీక్వెల్ గురించిన ప్ర‌క‌టన వెలువ‌డ‌లేదు. చేస్తాం అన్న మాటే కానీ క్లారిటీగా ఎప్ప‌టికి సెట్స్ కెళ‌తారు? అన్న‌ది మాత్రం హీరో శేష్ కానీ నిర్మాత‌లు కానీ వెల్ల‌డించ‌లేదు. 2020లో ప్రారంభిస్తామ‌న్నారు. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది? అన్న‌ది ఎవ‌రూ వెల్ల‌డించ‌లేదు. అయితే ఆల‌స్యం అయ్యే కొద్దీ అప్ప‌టి వేడి ఉంటుందా? వెంట‌నే చేసేస్తే ఆ వేడి ఆడియెన్ లో ఉండేది. కానీ అంత‌కంత‌కు ఈ సీక్వెల్ ఆల‌స్యం అవుతూనే ఉంది.  ప్ర‌స్తుతం శేష్ వేరే సినిమాలు చేస్తూ బిజీ. అత‌డు నటించిన `ఎవ‌రు` ఈ నెల 15న రిలీజ‌వుతోంది. ఆ త‌ర్వాత `మేజ‌ర్` ప్రారంభ‌మ‌వుతుంది. దీనివ‌ల్ల గూఢ‌చారి సీక్వెల్ కోసం అభిమానులు వేచి చూసే వీలుంటుందా? అన్న‌ది చూడాలి.

`గూఢ‌చారి` నిర్మాత‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప్ర‌స్తుతం వ‌రుస‌ సినిమాల‌తో బిజీ. వెంకీ- చైతూ కాంబినేష‌న్ సినిమా `వెంకీ మామ‌`తో బిజీ. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో `నిశ్శ‌బ్దం` అనే ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీని చేస్తున్నారు. అలాగే డ్వేన్ బ్రావో కీల‌క పాత్ర‌లో ఓ సోష‌ల్ అవేర్ నెస్ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా అధినేత వివేక్ కూఛిభొట్ల .. మ‌ల్టీ డైమ‌న్ష‌న్ వాసు కాంబోలో `గూఢ‌చారి` సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ఇదివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. త్వ‌ర‌లో వివ‌రం చెబుతామ‌ని అన్నారు. కానీ ఇంత‌వ‌ర‌కూ దీనికి సంబంధించి ఎలాంటి స‌మాచారం లేదు. బ్లాక్ బ‌స్ట‌ర్ `గూఢ‌చారి` రిలీజై నేటితో ఏడాది పూర్త‌యింది. క‌నీసం ఈసారైనా సీక్వెల్ గురించి నిర్మాత‌లు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

    

Tags:    

Similar News