నేను హాస్టల్లో ఉన్నప్పుడు.. అందరూ నన్నే రూమ్ కు పిలిచేవారుః హీరోయిన్
'నభానటేష్..' టాలీవుడ్ లోకి 'నన్ను దోచుకుందువటే' సినిమాతో ఎంటరైన ఈ బ్యూటీ.. అతి తక్కువ కాలంలో తెలుగుప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ అమ్మడు నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ నటనకు మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో.. క్రమక్రమంగా తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది నభా. ఇక, సోషల్ మీడియాలో ఈ కన్నడ బ్యూటీ చేసే రచ్చమామూలుగా ఉండదు.. చీరతో నిండైన రూపాన్ని ప్రదర్శిస్తుంది.. స్కిన్ షో చేస్తూ అందాలు ఆరబోస్తూ ఉంటుంది.
ఆమె తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినప్పటికీ.. ఇస్మార్ట్ శంకర్ మాత్రం రచ్చ రంబోలా చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీలో నభా నటేష్ పోషించిన పాత్రకు యూత్ ఫిదా అయ్యింది. రప్ క్యారెక్టర్ లో ఈ అమ్మడు రెచ్చిపోయి నటించడంతో.. ప్యాన్స్ ఈల వేసి గోల చేశారు.
అయితే.. ఆ తర్వాత రెండు సినిమాల్లో నటించింది నటేష్. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో 2020 చివర్లో వచ్చిన సోలో బ్రతుకే సో బెటర్ కమర్షియల్ గా హిట్ కొట్టినప్పటికీ.. సంక్రాంతి బరిలో నిలిచిన అల్లుడు అదుర్స్ నిరాశ పరిచింది.
కాగా.. లేటెస్ట్ గా సోషల్మీడియాలో తన ఫాలోవర్లో 'ట్రూ ఆర్ ఫాల్స్' గేమ్ ఆడిందీ బ్యూటీ. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు తడుము కోకుండా సమాధానాలిచ్చిందీ అమ్మడు. దెయ్యాలంటే భయం ఉందా? అనే ప్రశ్న మొదలు.. లవ్ లో ఉన్నారా? అనే ప్రశ్న వరకూ అన్నింటినీ అడిగేశారు నెటిజన్లు.
అయితే.. ఓ నెటిజన్ సిల్లీ క్వశ్చన్ అడిగాడు. బల్లులపై మీ అభిప్రాయం ఏంటీ..? వాటిని చూసి భయపడతారా? అని అడిగాడు. దానికి ఎలాంటి సమాధానం ఇచ్చిందంటే.. తనకు బల్లి అంటే అస్సలే భయం లేదని చెప్పింది నభా నటేష్. అంతేకాదు.. తాను హాస్టల్ ఉన్నప్పుడు ఎవరి రూమ్ లో బల్లి కనిపించినా తన వద్దకు పరిగెత్తుకు వచ్చేవారని చెప్పింది. ఆ బల్లిని పంపించడానికి అందరూ నన్నే వారి రూమ్ కు తీసుకెళ్లేవారని చెప్పుకొచ్చింది నభా.