అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు కాస్త ఎక్కువ ఎమోషనల్ అనే విషయం తెల్సిందే. అమ్మాయిల హృదయాలు సున్నితంగా ఉంటాయి. కాని జాన్వీ కపూర్ అందరు అమ్మాయిల కంటే ఇంకాస్త ఎక్కువ సున్నితంగా ఉంటాయని తాజాగా ఆమె చెప్పిన ఒక సంఘటన ఆధారంగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహానటి చిత్రం గురించి స్పందించింది. ఆసినిమాను చాలా సార్లు చూశాను. అయితే మొదటి సారి చూసిన సమయం లో మాత్రం చాలా ఏడ్చాను అంది.
మహానటి చిత్రం చూసిన తర్వాత నేను వెంటనే కీర్తి సురేష్ కు ఫోన్ చేసి ఏడ్చేశాను. అసలు అలా ఎందుకు ఏడ్చేశానో నాకు అర్థం కాలేదు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జీవితం గురించి మహానటిలో చూపించడంతో కదిలి పోయాను. ఆమె జీవితంలో కీర్తి సురేష్ జీవించారు. అందుకే కీర్తి కి ఫోన్ చేసి అభినందించాను. ఆ తర్వాత ఆ సినిమాను ఎన్నో సార్లు చూశాను. చూసిన ప్రతి సారి కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూనే ఉంటానంది.
సాదారణంగా సినిమాలు చూసి చాలా మంది ఏడుస్తారు. కాని సెలబ్రెటీలు అది కూడా హీరోయిన్స్ సినిమాలు చూసి ఏడ్వడం అంటే చెప్పుకోదగ్గ విషయం. జాన్వీ కపూర్ అందరమ్మాయిల కంటే మరింత ఎమోషనల్ అవ్వడం వల్లే మహానటి చిత్రంను చూసి ఏడ్చి ఉంటుంది. అయితే హీరోయిన్స్ మరీ అంత ఎమోషనల్ ఉండటం కరెక్ట్ కాదేమో అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఎమోషనల్ గా ఉంటే కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జనాలు సలహా ఇస్తున్నారు.