ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న విజువల్ వండర్ హాలీవుడ్ మూవీ అవతార్ 2 మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ షురూ అయ్యింది. పదుల కొద్ది భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
తెలుగు లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు డిస్నీ స్థానిక డిస్టిబ్యూటర్స్ తో చర్చలు జరుపుతున్నారు. సాధారణంగా అయితే హాలీవుడ్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సమయంలో 30 నుండి 40 శాతం డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తారు. కానీ ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ 50 శాతం నుండి 60 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట.
డిస్నీ వారు మాత్రం ఇప్పటి వరకు అంత వాటాను ఇచ్చేందుకు ఓకే చెప్పడం లేదట. 40 శాతం వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ ను ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇంకా చర్చలు జరుగుతున్నాయి అంటూ సమాచారం అందుతోంది.
ఒక వైపు మల్టీప్లెక్స్ థియేటర్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం అవ్వగా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడంతో అవతార్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇంకా ఎప్పుడు అంటూ అవతార్ 2 బుకింగ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కొందరు మాత్రం మల్టీ ఫ్లెక్స్ లో బుక్ చేసుకుంటున్నారు.
విడుదలకు మరో మూడు రోజుల సమయం ఉంది. కనుక ఈ రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఎవరో ఒకరు రాజీ పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.