దేశంలో ఖ‌రీదైన మూకీ చిత్రం ఏది?

Update: 2021-01-26 10:30 GMT
మూకీ సినిమా అన‌గానే లెజెండ్ సింగీతం శ్రీ‌నివాస‌రావు తెర‌కెక్కించ‌న పుష్ప‌క విమానం ఠ‌కీమ‌ని గుర్తొస్తుంది. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. మాట‌రాని మౌనిలా క‌మ‌ల్ అభిన‌యించిన తీరు క్రైమ్ డ్రామాతో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇప్ప‌టికీ ఎక్క‌డా బోర్ క‌ట్టించ‌ని మోడ్ర‌న్ క‌థ‌నం పుష్ప‌క‌విమానం ప్ర‌త్యేక‌త‌. అందుకే  ద‌శాబ్ధాలు గ‌డిచినా ఎప్ప‌టికీ ఎవ్వ‌ర్ గ్రీన్ మూవీగా నిలిచింది.

దేశంలో అత్యంత ఖ‌రీదైన మూకీ ఏది? అన్న ప్ర‌శ్న వ‌స్తే మాత్రం  ఇండియాకి టాకీ సినిమాలు రాకముందు.. మూకీ యుగంలో ఒక సినిమా ఉంది. 1900 సంవ‌త్స‌రం ప్రారంభంలో నారాయణన్ అనే పాపుల‌ర్  పంపిణీదారుడు మద్రాసు కేంద్రంగా ఎన్నో సినిమాల్ని అందించారు. ఆయ‌న బ్యాన‌ర్ లో అత్యంత ఖ‌రీదైన చిత్రంగా `లీలా-ది స్టార్ ఆఫ్ మింగ్రేలియా` పాపుల‌రైంది. దాదాపు 75000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన నిశ్శబ్ద(మూకీ) చిత్రంగా రికార్డుల‌కెక్కింది.

20 రీళ్ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం అరేబియా బ్యాక్ డ్రాప్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇది మద్రాసులోని వెల్లింగ్టన్ సినిమా.. బొంబాయిలోని సూపర్ సినిమాస్ స‌హా .. బర్మా -సింగపూర్లలో కూడా పెద్ద ఎత్తున‌ విడుదలైంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వ‌డంతో నారాయణన్ బాగా డబ్బు సంపాదించారు. అణా కాణీల గురించి మాట్లాడే ఆ రోజుల్లోనే అత్యంత‌ కాస్ట్ లీ సినిమాగా దీని గురించి ఎంతో చెప్పుకున్నారంటే ఓమారు గుర్తు చేసుకుని  తీరాల్సిందే. ఇంత‌కీ ఈ సినిమా విజువ‌ల్ ఇప్పుడు అందుబాటులో ఉందో లేదో?


Tags:    

Similar News