ల‌తా మంగేష్క‌ర్ ఆస్తుల‌కు వార‌సులెవ‌రు?

Update: 2022-02-08 05:45 GMT
గాన కోకిల ల‌తా మంగేష్క‌ర్ స‌క్సెస్ తో పాటు ఆస్తులు కూడా భారీగానే కూడ‌బెట్టారు. సాధార‌ణ గాయ‌నిగా మొద‌లైన ల‌తాజీ ప్ర‌స్థానం దేశ స‌రిహ‌ద్దులు దాటి విశ్వ వ్యాప్త‌మైంది. స్టార్ సింగ‌ర్ గా  ఎనిమిది ద‌శాబ్ధాల  పాటు కొన‌సాగారు. చాలా త‌క్కువ స‌మ‌యంలో ల‌తాజీ గానంలో త‌న మార్క్ వేసారు. అప్ప‌టికే సింగ‌ర్ల‌కు భారీగా పారితోషికం ఇచ్చేవారు.

ఇక ల‌తాజీ ఎంట‌ర్ అయిన త‌ర్వాత ఆమె పారితోషికం అంద‌రికంటే రెట్టింపు ఉండేది. ఒకానొక స‌మ‌యంలో సంగీత ద‌ర్శ‌కుల‌కు స‌మాన పారితోషకం అందుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక విదేశీ క‌చేరీలు..వ్య‌క్తిగ‌త ఈవెంట్లతో ల‌తాజీ బాగానే సంపాదించేవారు.

ఆ ర‌కంగా ఆర్ధికంగా ల‌తా మంగేష్క‌ర్ చాలా కాలం క్రిత‌మే బాగా స్థిర‌ప‌డ్డారు. ఇంకా ఇత‌ర వ్యాపారాల్లోనూ ల‌తాజీ పెట్టుబ‌డ‌లు పెట్టారు. విదేశాల్లో రెస్టారెంట్ల నిర్వ‌హ‌ణ స‌హా కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. ఇలా ల‌తాజీ ఆర్ధికంగా బాగానే సంపాదించారు. ఇక విత‌ర‌ణ కార్య‌క్ర‌మాల్లోనూ ల‌తాజీ చురుకులా పాల్గొనేవారు.

1983లో భార‌త్  వ‌ర‌ల్డ్ క‌ప్ గెటిచిన‌ప్పుడు బీసీసీకి ఆర్ధిక స‌హాయం చేసారు. ఆ డ‌బ్బును బీసీసీఐ టోర్నీలో పాల్గొన్న వారికి ప్రైజ్ మ‌నీ రూపంలో ఇచ్చింది. అప్ప‌ట్లో బీసీసీఐ ఆదాయం త‌క్కువ‌. ఈ క్ర‌మంలో ల‌తాజీ క‌చేరి నిర్వ‌హించ‌డంతో  బీసీసీఐ కి బాగా ఆదాయం స‌మ‌కూరింది.

అలా ల‌తాజీ క్రీడాకారుల‌పై ఎంతో సానుకూలంగా  ఉండేవార‌ని బ‌య‌ట‌ప‌డింది. ప్ర‌స్తుతం ల‌తా మంగేష్క‌ర్ ఆస్తులు విలువ రెండు వ‌ద‌ల కోట్ల‌కు పైగానే ఉందిట‌. అయితే ల‌తాజీ పెళ్లి చేసుకోలేదు. పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకోలేదు.  

ఆ ర‌కంగా అధికారికంగా వార‌సులు లేరు. తోబుట్టువులు..వారి వార‌సులు అంతా బాగా స్థిర‌ప‌డిన‌వారే. ఈ నేప‌థ్యంలో ల‌తాజీ ఆస్తులు ఎవ‌రి పేరు మీద‌కు బ‌దిలీ అవుతాయి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఆమె ఆస్తుల‌కు సంబంధించి కుటుంబ స‌భ్యుల‌లో ఎవ‌రి పేరు మీద‌నైనా వీలునామా రాసారా?  లేక ఏదైనా ట్ర‌స్ట్ కి రాసిచ్చారా? అన్న దానిపై స్ప‌ష్టత రావాల్సి ఉంది.
Tags:    

Similar News