మంచు లక్ష్మి ని టచ్ చేసే ధైర్యం ఎవరికుంది?

Update: 2018-10-29 06:53 GMT
ఇప్పుడు #మీటూ అనేది ఒక హాట్ టాపిక్.  బాలీవుడ్ లో సినిమాలు ఆగిపోతున్నాయి. రిలీజులు వాయిదాలు పడుతున్నాయి. టాలీవుడ్ లో ఇంకా అంతా దూరం పోలేదు..  శ్రీరెడ్డి ఎపిసోడ్ లో ఈ ఉద్యమం కాస్త ఊపందుకున్నట్టు అనిపించినా.. ఆ తర్వాత పక్కదారి పట్టడం తో మళ్ళీ #మీటూ కు అంత సపోర్ట్ రాలేదు.  ఇక #మీటూ విషయంపై చాలారోజుల క్రితమే.. అందరికంటే ముందుగా హీరోయిన్ మాధవి లత స్పందించింది.

ఎవరైనా అవకాశాల పేరిట అమ్మాయిలను  లైంగికంగా వేధిస్తే వాళ్ళను చెంపదెబ్బ కొట్టాలని ఈమధ్య ఒక ఇండస్ట్రీ పెద్ద అన్నారు. రీసెంట్ గా మాధవి ఈ విషయంపై మాట్లాడుతూ "ఒకవేళ అలా కొట్టిన తర్వాత కూడా ఆ అమ్మాయికి అవకాశాలు వస్తాయని మీరు గ్యారంటీ ఇస్తే వాళ్ళను అమ్మాయిలు తుక్కు తుక్కుగా కొడతారు" అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.  టాలీవుడ్ లో క్యాస్టింగ్ కోచ్ లేదని మంచు లక్ష్మి మాట్లాడి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది.  "మంచు లక్ష్మిని టచ్ చేసే ధైర్యం ఎవరికి ఉంది? ఆమె మోహన్ బాబు కూతురు.. ఆమె జోలికి పోతే మోహన్ బాబు కొడతాడని లేదా చంపేస్తాడని జనాలకు భయం" అని చెప్పింది.

కానీ టాలీవుడ్ లో ఇతర హీరోయిన్ లు క్యాస్టింగ్ కోచ్ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని  మంచు లక్ష్మి అంగీకరించి ఉండాల్సింది అని చెప్పింది. బయటకు వచ్చి క్యాస్టింగ్ కోచ్ గురించి చెప్తే తమకు ఇక అవకాశాలు రావని హీరోయిన్లు భయపడుతున్నారు కానీ స్టార్ హీరోయిన్లు బయటకొచ్చి నిజాలు మాట్లాడితే కనీసం ఐదేళ్ళ తర్వాతైనా ఇండస్ట్రీలో మార్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పింది.
Tags:    

Similar News