మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత 'లూసిఫర్' రీమేక్ లో నటించేందుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో చిరంజీవితో నటించబోయే మరో హీరో గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
మలయాళంలో మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగులో చిరు పోషిస్తారు. పృథ్వీరాజ్ నటించిన పాత్రలో అల్లు అర్జున్ నటిస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నటించడం లేదని అంటున్నారు. అయితే ఈ పాత్రకు ఓ యువ హీరో అయితేనే బాగుంటుందని మాత్రం చర్చ సాగుతోంది. మెగా ఫ్యామిలీ హీరోలను సరదాగా చాలామంది క్రికెట్ టీం అంటూ ఉంటారు. ఈ పాత్ర కోసం చిరు స్వయంగా మెగా ఫ్యామిలీలో ఒక హీరోను ఎంపిక చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి ఇంత పెద్ద టీమ్ లో చిరు పక్కన నటించే లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో వేచి చూడాలి.
మెగాస్టార్ తో ఇంతవరకూ చాలామంది మెగా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సాయి ధరమ్ తేజ్.. వరుణ్ తేజ్.. లాంటి యువ హీరోలలో ఎవరైనా ఈ పాత్రకు సెట్ అవుతారని మెగా ఫ్యాన్స్ లో చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉంది. చిరు ప్రస్తుతం నటిస్తున్న 'ఆచార్య' పూర్తయిన తర్వాతే 'లూసిఫర్' రీమేక్ ను ప్రారంభిస్తారట.