అమెరికాకు చెందిన పాప్‌సింగర్ రిహాన్నా పెట్టిన ఓ ట్వీట్.. భారతదేశంలో పెను సంచలనం సృష్టించింది. ఆమె పెట్టిన ట్వీట్‌కు ట్విట్టర్ షేక్ అయ్యింది. నిన్నంతా ఆమె గురించే చర్చ. మనదేశంలో వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి ఇప్పటికే మనదేశానికి చెందిన పలువురు ప్రజాస్వామిక వాదులు మద్దతు తెలిపారు.
అయితే ఇప్పుడు ఈ వివాదం అంతర్జాతీయ స్థాయికి పాకింది. అమెరికాకు చెందిన పాప్‌సింగర్ రిహాన్నా నిన్న ఓ ట్వీట్ పెట్టారు.
భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ న్యూస్ ఆర్టికల్‌ను ఆమె జతచేసి..
‘భారత్‌లో జరుగుతున్న రైతు ఉద్యమం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం లేదు.’ అంటూ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ పెను ప్రకంపణలు సృష్టించింది.
రిహాన్నాకు కూడా భారీగా ఫాలోయింగ్ వచ్చింది. ఆమె చేసిన ట్వీట్‌ను ఇప్పటివరకు 275.4 k మంది రీట్వీట్ చేశారు. 753.1 k యూజర్లు లైక్ చేశారు. అంతేకాక ఆమెకు ఒక్కరోజులోనే 10 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు.
మన విదేశాంగ కూడా ఈ విషయంపై స్పందించింది. మా దేశ అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలకు చెందిన వాళ్లు ఎందుకు మాట్లాడుకోవాలంటూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. మరోవైపు బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ‘అది రైతు ఉద్యమం కాదు.. దేశానికి విభజించడానికి చేస్తున్న ఉగ్రవాదుల కుట్ర’ అంటూ రిప్లై ఇచ్చారు. కంగనా రిప్లై కూడా వివాదాస్పదం అయ్యింది. అయితే రిహాన్నా మాత్రం నిన్న చాలామంది భారతీయులు నోట్లో మెదిలారు. ‘ రిహాన్నా ఎవరు’ ‘రిహాన్నా స్వస్థలం పాకిస్థానా’ ఇలా నిన్న లక్షలమంది గూగుల్‌లో వెతి కారు.
ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ ప్రకటించింది.
రిహాన్నాతో పాటు స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్, నటుడు జాన్ కుసాక్, యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్, -అమెరికన్ మోడల్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా తదితరులు రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. అయితే రిహాన్నాకు భారతీయ సెలబ్రిటీలు సచిన్, అక్షయ్‌కుమార్, విరాట్ కోహ్లీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ఎవరీ రిహాన్నా.?
రిహాన్నా బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో రిహన్నా ఫెంటీ ఓ పేదకుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నతనంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. యవ్వనంలో ఉన్నప్పుడు జీవనోపాధి కోసం తన తండ్రితో పాటు టోపీలు, బెల్టులను విక్రయించారు. 17 వ ఏట ఆమె పాప్సింగర్గా కెరీర్‌ను ప్రారంభించారు. 2005లో విడుదలైన ఆమె మొట్టమొదటి ఆల్బం ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ 2 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది.