2020 సంవత్సరంలో అత్యంత స్టైలిష్ మ్యాన్ ఎవరు? బాలీవుడ్ నుంచి రణవీర్ సింగ్.. టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ .. విజయ్ దేవరకొండ .. ప్రభాస్ వీళ్లలో ఎవరై ఉంటారు? అంటే.. దీనికి ప్రఖ్యాత జీక్యూ మ్యాగజైన్ సెలెక్షన్ ఇప్పటికే ఖరారైంది.
ఎప్పటిలానే 2020 ఇయర్ ఆద్యంతం తనదైన ఇన్నోవేషన్ తో స్టైల్ ఐకన్ గా ప్రతిసారీ మీడియాలో హంగామా సృష్టించిన రణవీర్ సింగ్ నే జీక్యూ ఓటింగ్ ఎంపిక చేసింది. దేశవిదేశాల్లో ఆసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టైలిష్ ఫ్యాషన్ ఐకన్ గా రణవీర్ పేరు రికార్డులకెక్కింది.
ఇక 2020 సీజన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. రౌడీ విజయ్ దేవరకొండ ఫ్యాషన్ పరంగా ఎక్కడా తగ్గకపోయనా.. ఆ ఇద్దరూ ఇప్పటికి పాన్ ఇండియా అప్పీల్ ని కలిగి లేరు. పాన్ ఇండియా సినిమాలతో అటు హిందీ బెల్ట్ లోనూ అసాధారణ ఫాలోయింగ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే బన్ని.. దేవరకొండ పాన్ ఇండియా సినిమాలతో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇంతమందిలో రణవీర్ సింగ్ కే అంత గుర్తింపు ఎందుకు? అంటే.. టోటల్ ఇండస్ట్రీస్ లోనే అంత ఎనర్జిటిక్ గా వైబ్రేంట్ గా వెరైటీ ఫ్యాషన్స్ ని పరిచయం చేస్తున్న వేరొక హీరో లేనే లేడన్నది ఓ విశ్లేషణ. రౌడీ దేవరకొండ మాత్రం తనని ఫాలో చేసేందుకు ప్రయత్నిస్తూ అందరి కంటా పడుతున్నాడు. బన్ని మాత్రం డీసెంట్ స్టైల్స్ తో ఆకర్షిస్తున్నారు.
అయితే ఆ ఇద్దరూ GQ విజేతల జాబితాలో లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈసారి అనూహ్యంగా మానవతావాదిగా సోను సూద్ పాపులరయ్యారు. కోవిడ్ క్రైసిస్ లో రీల్-లైఫ్ విలన్ నిజ జీవిత హీరోగా మారారు. అతను వేలాది మంది పేద ప్రజలను వారి సొంత పట్టణాలకు చేరుకోవడానికి రవాణా ఇతర ప్రాథమిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అందుకే ఆ గొప్ప పనికి ‘మానవతావాద’ అవార్డును అందుకున్నారు.