ద‌ళ‌ప‌తి 65 విల‌న్ సేతుప‌తి మిస్స‌యితే ఇంకెవ‌రు?

Update: 2021-04-02 03:30 GMT
ద‌ళ‌ప‌తి 65 చెన్నైలో ఘ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న ఈ సినిమా ఇలా ప్రారంభ‌మైందో లేదో ఈపాటికే అభిమానుల్లో భారీ బెట్టింగ్ న‌డుస్తోంది. ఈ సినిమాలో విల‌న్ గా న‌టించేది ఎవ‌రు? అన్న‌దే ఇప్పుడు సోష‌ల్ మీడియాల్లో విజ‌య్ ఫ్యాన్స్ లో ఆస‌క్తిక‌ర డిబేట్.

2020 సంక్రాంతి బ‌రిలో రిలీజైన మాస్ట‌ర్ లో విజ‌య్ కి ధీటుగా విజ‌య్ సేతుప‌తి విల‌న్ గా క‌నిపించారు. ఆ ఇద్ద‌రూ నువ్వా నేనా? అంటూ పోటీప‌డి న‌టించారు. అది త‌మిళ మాస్‌ అభిమానుల‌కు గొప్ప ట్రీట్ అయ్యింది. అందుకే ఈసారి ద‌ళ‌ప‌తి 65 లో న‌టించే విల‌న్ ఎవ‌రు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. తాజా స‌మాచారం మేర‌కు ఈసారి యూనివ‌ర్శ‌ల్ గా ఉండే ఒక కొత్త విల‌న్ ని బ‌రిలో దించేందుకు ద‌ర్శ‌కుడు  దర్శకుడు నెల్సన్ దిలీప్ ‌కుమార్ స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతానికి ప్రారంభోత్స‌వ‌ ఈవెంట్ నుండి ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నైలోని పెరుంగుడిలోని సన్ పిక్చర్స్ కార్యాలయంలో సినిమాని లాంచ్ చేయ‌గా.... సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రంలో ప‌లువురు టాప్ స్టార్లు న‌టిస్తున్నారు. పూజా హెగ్డే ఈ చిత్రంలో ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ద‌ళ‌పతి 65 షూటింగ్ మే నెలలో ఒక పాటతో ప్రారంభమవుతుంద‌ని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెల్ల‌డించిన కొద్ది నిమిషాల‌కే త‌న పోస్ట్ ని తొల‌గించారు. ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ కి అనిరుధ్ రవిచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు.
Tags:    

Similar News