'సర్కారు వారి పాట' సినిమా వచ్చి ఆరు నెలలు కావొస్తున్నా డైరెక్టర్ పరశురామ్ పెట్లా ఇంతవరకూ తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచుంటే వెంటనే ఏదొక ప్రాజెక్ట్ సెట్ అయ్యేది కానీ.. ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేయడంతో ఏదీ కుదరడం లేదని తెలుస్తోంది.
'సర్కారు వారి పాట' కంటే ముందే అక్కినేని నాగచైతన్య తో పరశురాం ఓ సినిమా చేయాల్సింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో అధికారిక ప్రకటన ఇచ్చారు. 'నాగేశ్వరరావు' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి పిలుపు రావడంతో.. నిర్మాతలకు నచ్చజెప్పి చైతూ సినిమాని హోల్డ్ లో పెట్టి అక్కడికి షిఫ్ట్ అయ్యాడు.
అయితే SVP సినిమా తర్వాత చైతన్యతో సినిమా ఉంటుందని పరశురాం పలు ఇంటర్వూలలో చెబుతూ వచ్చారు. కానీ చైతూ మాత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీ #NC22 ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు.
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పరశురాం ప్రాజెక్ట్ పై స్పందించిన చైతూ.. కథ గురించి మాట్లాడుకున్నామని.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక ఆ సినిమా ఎప్పుడనేది చెబుతామని అన్నారు. అయితే అక్కినేని హీరో ఇంతవరకూ స్క్రిప్టు ఫైనల్ చేయలేదనే టాక్ వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇటీవల 'ఊర్వశివో రాక్షసివో' ఈవెంట్ లో పరశురాం.. త్వరలో ఓ అద్భుతమైన కథతో నందమూరి బాలకృష్ణ ను కలవబోతున్నట్లు స్టేజీ మీదే ప్రకటించారు. కథ కూడా అల్లు అరవింద్ కు తెలుసని చెప్పడంతో.. ఇది గీతా ఆర్ట్స్ లోనే రూపొందనుందనే విషయం అర్థమైంది.
కాకపోతే గీతాలో బాలయ్యతో సినిమా చేస్తే.. నాగచైతన్య - 14 రీల్స్ సంగతేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి కొన్నేళ్ల గీతా ఆర్ట్స్ లోనే ఉన్న పరశురాం.. 'కొత్త జంట' 'గీత గోవిదం' తర్వాత అదే బ్యానర్ లో సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చాడు.
అయితే 14 రీల్స్ లో సినిమా బాకీ ఉండటంతో నాగచైతన్య ప్రాజెక్ట్ చేసి రావాలని అనుకున్నాడు. కానీ చైతూ సినిమాని హోల్డ్ లో పెట్టాల్సి రావడంతో.. మహేష్ మూవీలో 14 రీల్స్ ను భాగం చేశారని టాక్. ఈ నేపథ్యంలో ఇప్పుడు గీతాలో బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం 'వీర సింహా రెడ్డి' సినిమా చేస్తున్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK108 మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా పూర్తయ్యే టైంలో పరశురాంకి మరో ప్రాజెక్ట్ చేసుకోడానికి సమయం దొరుకుతుంది. మరి దర్శకుడు ఈ గ్యాప్ లో చైతన్యతో సినిమా చేస్తాడా? లేదా బాలయ్య కోసం ఎదురు చూస్తాడా? అనేది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.