మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఏ స్టార్ కి ?

Update: 2019-10-17 14:30 GMT
వచ్చే సంక్రాంతికి ఫ్యాన్ వార్ తప్పేలా లేదు. సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్లలు డైరెక్ట్ ఫైట్ కి సై అనడంతో సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠ పురములో జనవరి 12న ఒకే రోజు తలపడనున్నాయి. ఎవరిది పై చేయి అవుతుందా అనే ఉత్కంట అభిమానుల్లో ఉండగా ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడి ఎక్కడ వసూళ్లు ప్రభావితం చెందుతాయో అని బయ్యర్లు ఖంగారు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఓపెనింగ్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

దీని మీద సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల మద్దతుదారుల మధ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చోటు చేసుకుంటున్నాయి. మెగా ఫ్యాన్స్ తమ హీరోకంటే తమ హీరోకు సపోర్ట్ చేస్తారంటూ పరస్పరం కామెంట్లు చేసుకుంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. మహేష్ కు చిరుకు మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇటీవలే ఓ వేడుకలో ప్రిన్స్ చిరుతో అత్యంత సన్నిహితంగా మెలగడం పబ్లిక్ స్టేజి మీదే మెగాస్టార్ మీద ప్రశంసలు గుప్పించడం బాగా హై లైట్ అయ్యింది.

చివరి నెంబర్ వన్ చిరునే అని ఎప్పుడో మహేష్ చెప్పిన ఇంటర్వ్యూ పేపర్ కటింగ్ ఇప్పటికీ కొందరు చెలామణిలో పెడుతూనే ఉంటారు. సైరా రిలీజయ్యాక ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది కూడా మహేష్ బాబే. మరోవైపు బన్నీ తమకు రోడ్డు వేసిచ్చిన రోల్ మోడల్ గా చెప్పుకునే చిరంజీవి పట్ల అంత ఆరాధనాభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ మొదటి ఓటు అల వైకుంఠపురముకే వేస్తారని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ స్టాండ్ ఎవరి వైపు అనేది చాలా ఆసక్తికరంగా మారేలా కనిపిస్తోంది
Tags:    

Similar News