వచ్చే నెల 9 మహర్షి విడుదల కోసం మహేష్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టేసుకున్నారు . దానికన్నా ముందు మే 1న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండటంతో ముందు దాని కోసం రెడీ అవుతున్నారు. పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్ గా జరగనున్న ఈ వేడుక కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ సారి గెస్ట్ గా ఎవరు వస్తారు అనే దాని గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
లాస్ట్ టైం భరత్ అనే నేనుకు జూనియర్ ఎన్టీఆర్ రావడం బాగా ప్లస్ అయ్యింది. అంతకు ముందు మహేష్ ఫంక్షన్లకు నాన్న కృష్ణ గెస్ట్ గా వచ్చేవారు. ప్రత్యేకంగా బయటి వారిని ఇన్వైట్ చేసే వారు కాదు. కాని భరత్ అనే నేనుకి తారక్ రావడం ఎంత ఆకర్షణ అయ్యిందో అందరూ చూశారు. సో మహర్షికు కూడా అదే తరహలో ప్లానింగ్ చేస్తున్నట్టు వినికిడి
మరి జూనియర్ మళ్ళి వస్తాడా లేక ఆర్ ఆర్ ఆర్ కాంబినేషన్ ని స్టేజి మీద చూపించేలా రామ్ చరణ్ కూడా చేయి కలుపుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ అందుబాటులోనే ఉన్నారు. అయితే ఇన్ సైడ్ టాక్ ఇంకోలా ఉంది. మహర్షి ఈవెంట్ కి ఇద్దరినీ కలిపి పిలవకపోవచ్చని ఒకవేళ అదే జరిగితే ఫోకస్ మొత్తం వాళ్ళ మీద ఉండటంతో పాటు మహేష్ అభిమానులకు తోడు ఆ ఫ్యాన్స్ కూడా తోడైతే కంట్రోల్ చేయడం కష్టం కావొచ్చని అంటున్నారు.
సో తారక్ చరణ్ లలో ఒకరే రావొచ్చని సారాంశం. ఇదేమి లేకుండా పాత పద్ధతిలో కేవలం మహేష్ ఫ్యామిలీ తోనే నడిపించేస్తారా అనేది మరో సందేహం. ఏది ఎలా ఉన్నా ఇంకో మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటిదాకా నాలుగు పాటలు ఓ టీజర్ విడుదలైన మహర్షి అసలైన ట్రైలర్ కోసం ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు