క్వీన్ కంగనలోని రెబలిజం గురించి పరిచయం అవసరం లేదు. ఛాన్స్ దొరికితే తొక్క తీస్తుంది. వీలున్న ప్రతి వేదికపైనా తన శత్రువుల్ని చీల్చి చెండాడుతుంది. ఇండస్ట్రీలో తన ఉన్నతిని కోరుకున్న స్నేహితులకు ఎంతటి విలువను ఇస్తుందో - తనతో పెట్టుకున్న శత్రువులకు అంతే పెద్ద రేంజులో కోటింగ్ ఇస్తుంది. తనతో విభేధిస్తే ఝాన్సీరాణిగా మారి కత్తి దూస్తుంది. ప్రత్యర్థి ఎంతటివారైనా ముప్పు తిప్పలు తప్పవు. అందుకు ఎగ్జాంపుల్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - గ్రేట్ ప్రొడ్యూసర్ రాకేష్ రోషన్. ఆ ఇద్దరిపైనా చట్టపరంగానూ పోరాడింది కంగన. ఈ పోరాట పటిమను చూసి ముచ్చటపడి.. తనని రియల్ క్వీన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.
కంగన నటించిన `మణికర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` ఈనెల 25న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని కీలక సమయంలో దర్శకుడు క్రిష్ వదిలేసి వచ్చేయడంతో - బ్యాలెన్స్ చిత్రీకరణ బాధ్యతను తీసుకున్న కంగన దర్శకురాలిగా సత్తా చాటేందుకు అహోరాత్రులు శ్రమించిందిట. ఆ సన్నివేశంపై కంగన కాస్తంత ఘాటుగానే స్పందించింది. ``దర్శకత్వం చేసేందుకు నేను అప్పటికి సిద్ధంగా లేను. నాకు యాక్సిడెంటల్ థింగ్స్ నచ్చవు. అయితే చేసే పని ఏదైనా తుదికంటా మనసు పెట్టి క్రమశిక్షణతో పని చేయడం అలవాటు. నాపై 45 రోజుల చిత్రీకరణ జరిగితే - దానికి ముందు 120రోజులు (4 నెలలు) ముందస్తు ప్రిపరేషన్ కే కేటాయించాను. చివరిలో కొన్ని రోజులు చాలా ఉద్విగ్నమైన దినాలు... నేను వేరొకరి జాబ్ ని చేశాను. ఇది చాలా కష్టతరమైనది. అది నా పని కాదు కదా?`` అంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు కంగన.
``అంతేకాదు.. మహిళలు దర్శకత్వం వహించడం అన్నది హాలీవుడ్ లోనే అంగీకరించలేదు. ఇక్కడ నన్ను అంగీకరిస్తారా? పరిశ్రమలో ఆడాళ్ల విషయంలో చిన్న చూపు పోలేదు. ఈ విషయంలో సెక్సిజమ్ (మహిళ అనే చిన్నచూపు) చాలానే ఉంది`` అని కంగన ఆవేదనను వ్యక్తం చేశారు. ``నా ఓటమి కోసం ఎదురు చూసే వాళ్లున్నారు. నేను ఫెయిలైతే వాళ్లు సంతోషిస్తారు. వాళ్లే బెటర్ అని ఫీలవ్వాలని! అందుకోసమే ఎదురు చూస్తున్నన్నారు కొందరు. కానీ నేను దేనికి తల వొంచను. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను`` అని వ్యాఖ్యానించారు కంగన. అయితే కంగన ఫెయిలవ్వాలని కోరుకునేదెవరు? ఇది క్రిష్ ని ఉద్ధేశించి అన్న మాటేనా? లేక తనని వ్యతిరేకించిన క్రిష్ - సోనూ సూద్ తదితరుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ కామెంట్ చేసిందా? దీనికి సరైన ఆన్సర్ ఎవరిస్తారు? కంగన- క్రిష్ డివైడ్ ఫ్యాక్టర్ లో రచయిత విజయేంద్ర ప్రసాద్ కంగన వెన్నంటి నిలిచిన సంగతి తెలిసిందే. సోనూసూద్ క్రిష్ ని సపోర్ట్ చేశారు. ఇక కంగన అంటే మండి పడే రచయితలు - దర్శకనిర్మాతలు - శత్రువులు బాలీవుడ్ లో కోకొల్లలుగా ఉన్నారు. హృతిక్ - రాకేష్ రోషన్ అంతటివారు క్వీన్ పై మండిపడుతూనే ఉంటారు. మరి అందరికీ కలిపి గంపగుత్తగా కోటింగ్ ఇచ్చిందా? అన్నది చూడాలి.
Full View