సరిగ్గా మూడు నెలల క్రితం మా సాక్షిగా శివాజీరాజా, నరేష్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అమెరికా జరగబోయే ఒక కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేశ్ ని ప్రత్యేక అతిథిగా పిలిచి ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుల్ని వృద్ధ కళాకారులకు ఉపయోగించాలనేది ఆలోచన. అయితే.. ఈ కార్యక్రమంలో దాదాపు కోటి రూపాయల అవినీతి జరిగిందని నరేశ్ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో ఓ నాలుగు రోజులు మీడియాలో ఒకటే హడావుడి. ఇద్దరూ బాహాటంగానే తిట్టుకున్నారు. కట్ చేస్తే.. నాలుగు రోజుల తర్వాత ఇద్దరూ కౌగిలించుకుని, షేక్ హ్యాండ్ లు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. చిన్న అపార్థంతోనే ఆరోపణలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ఎక్కడా కన్పించలేదు.
అయితే.. అప్పటినుంచి ఇద్దరి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం మాత్రం లోలోపల ఉంది. మా అధ్యక్ష ఎన్నికల సాక్షిగా ఇప్పుడు అది మరోసారి బయటపడింది. మా అధ్యక్షుడిగా ఈసారి కూడా శివాజీ రాజా పోటీ చేస్తున్నారు. శివాజీ రాజాకు పోటీగా నరేశ్ కూడా రంగంలోకి దిగాడు. సాధారణంగా మా ఎన్నికలు ఎప్పుడూ ఏకగ్రీవంగా జరుగుతాయి. కానీ మూడేళ్ల క్రితం రాజేంద్రప్రసాద్, జయసుధల వల్ల హోరాహోరీగా జరిగాయి. అయితే.. ఈసారి కూడా ఎన్నికలు తప్పట్లు లేవు. శివాజీరాజా, నరేశ్ ఇద్దరూ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అలాగనీ ఎవ్వరూ తగ్గడం లేదు. నరేష్ కు డాక్టర్ రాజశేఖర్ దంపతులు మద్దుతు ప్రకటించారు. మరి ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.