పోసానిలో ఉన్న ఫైర్ గురించి మనకు తెలిసిన విషయమే. ఎంత వేగంగా మాట్లాడతాడో.. వాటిలో అంత పవర్ కూడా ఉంటుంది. ఒరిజినల్ గానే రైటర్ అయిన పోసాని మాటల్లో ఆ మాత్రం పదును ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఓపెన్ గా మాట్లాడేయడంలో కూడా పోసానికి మించినోళ్లు మరొకరు టాలీవుడ్ లో కనిపించరేమో అనిపిస్తుంది.
ఇప్పుడు అల్లు అర్జున్ ను దేవుడు పంపించాడంటూ దేవదూతను చేసేశాడు పోసాని కృష్ణమురళి. ఇందుకు కారణం.. అల్లు అర్జున్ 5 లక్షల రూపాయలు ఇవ్వడమే. ఈ మాత్రం అమౌంట్ కే దేవుడిని చేసేయాలా అనుకోవచ్చు కానీ.. దీనికి ముందు వెనక కథ చాలా ఉంది. ఓసారి పోసానిని అల్లు అర్జున్ పిలిచి.. మీరు 30 ఏళ్లుగా ఎంతో మందికి ఎంతో చేశారని విన్నానని చెప్పి.. వద్దు అని చెప్పద్దంటూ ముందే కండిషన్ పెట్టి మరీ.. 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చాడట. ఇంతగా చెప్పడంతో ఏం మాట్లాడలేక.. సైలెంట్ గా తీసుకున్నాడట పోసాని.
అయితే.. ఇది జరిగిన కొన్ని రోజులకు 10వ తరగతి రిజల్ట్స్ రాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని 9.5 జీపీఏ సంపాదించిన రష్మిత.. రాజేశ్వరి.. షకినాబి అనే అమ్మాయిలకు డిగ్రీ పూర్తయ్యేవరకు చదువుకు సహకరిస్తానని మాటిచ్చాడట. బన్నీ డబ్బులు ఇచ్చిన కొన్ని రోజులకే ఇది జరగడంతో.. ముందుగానే దేవుడు బన్నీ రూపంలో తనకు డబ్బులు పంపాడని అంటున్నాడు పోసాని.